టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ కొట్టినా మనోడికి టైం కలిసి రావడం లేదు. ఈ సినిమాతో వరుసగా ఆరు హిట్లతో డబుల్ హ్యట్రిక్ హిట్లు కొట్టాడు. ఎన్టీఆర్ ఇంత ఫామ్‌లో ఉండి.. రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రకటించినా కూడా ఇప్పటకీ ఆరు నెలలుగా ఏ సినిమా పట్టాలు ఎక్కకుండా ఖాళీగానే ఉన్నాడు. కొరటాల శివ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో కూడా తెలియట్లేదు.
కేవలం ఆచార్య దెబ్బతో కొరటాల డిప్రెషన్ మూడ్‌లోకి వెళ్లిపోయి కథపై రకరకాల మార్పులు చేస్తున్నాడు. ఇదే ఈ సినిమా ఆలస్యానికి కారణం. డిసెంబర్ లేదా జనవరి అంటున్నా చెప్పలేని పరిస్థితి. అసలు ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో ? ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ సినిమా పరిస్థితే ఇలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ దెబ్బతో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా సినిమా పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది.
సాహో, రాధేశ్యామ్ లాంటి వరుస ప్లాపులతో ఉన్న ప్రభాస్ ఆదిపురుష్ చేస్తున్నాడు. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ చూసిన వాళ్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీజర్లపై చ్చిన విమర్శల దెబ్బతో ఇప్పుడే మేకర్స్ మళ్లీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందుకోసమే మరో రు. 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు టాక్ ? ఇక వచ్చే సంక్రాంతికి రిలీజ్ అనుకున్న ఈ సినిమాను ఇప్పుడు వచ్చే యేడాది జూన్ 16 రిలీజ్ అనుకుంటున్నారు.
ఈ ఎఫెక్ట్ ఇప్పుడు సలార్ మీద పడనుంది. సలార్‌ను వచ్చే యేడాది సెప్టెంబర్ 28న రిలీజ్ అనుకున్నారు. ఇప్పుడు ఆదిపురుష్ లేట్ ఎఫెక్ట్ సలార్ మీద పడింది. దీంతో సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో తీసే ఎన్టీఆర్ 31వ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో ? తెలియని పరిస్థితి. ముందుగా ప్రభాస్ ఆదిపురుష్ కంప్లీట్ చేయాలి.. ఆ తర్వాత సలార్ పూర్తి చేయాలి. ఈ లోగా ఎన్టీఆర్ కొరటాల శివ కంప్లీట్ చేస్తే.. అంటే ఏ 2024లోనో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది.