ఏంటో ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ అందరూ ఒక్కరి తర్వాత ఒకరు అనారోగ్యానికి గురవుతున్నారు. మనకు తెలిసిందే ప్రజెంట్ సినీ ఇండస్ట్రీ ఏ పోసిషన్ లో ఉందో. బిగ్ బిగ్ స్టార్స్ అందరు ఒకరి తర్వాత ఒకరిని కోల్పోతూ శోకశంద్రంలో మునిగిపోయింది . మొదట కృష్ణంరాజు ఆ తర్వాత కృష్ణ ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణించి సినీ ఇండస్ట్రీకి తీరని తీవ్ర శోకాన్ని మిగిల్చారు. యంగ్ బ్యూటీస్ , హీరో లు సైతం అరుదైన వ్యాధుల బారిన పడడం ఇండస్ట్రీలో మరో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .
రీసెంట్గా సమంత మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . సమంతనే కాదు సమంత లాగే మరి కొంతమంది స్టార్స్ హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నామంటూ ముందుకు వచ్చి చెప్పారు. కాకపోతే టాలీవుడ్ బుట్ట బొమ్మ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఆరోగ్యం రోజురోజుకి మరింత క్షీణిస్తుందని డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. ఆమె కాళ్ళకి అయిన గాయం ఏమాత్రం నయం కావడం లేదని ..ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చిన ఆమె గాయం అలానే ఉండడం డాక్టర్లకే అంతు చిక్కని ప్రశ్నగా మిగిలి పోయిందట .
దీనికి కారణం పూజా హెగ్డే అంటూ తెలుస్తుంది . డాక్టర్స్ ఇచ్చిన సజెషన్స్ పాటించకుండా ..తన సొంత వైద్యాలతో తన కాలును మరింత ఇబ్బంది కరం మైన పరిస్థితిలోకి నెట్టేసుకుందట . రీసెంట్గా చెక్ చేసిన డాక్టర్ మరో మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటే కానీ కాళ్ల గాయం నయం అవ్వదని తేల్చి చెప్పేసాడట. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఎందుకు ఇలా చేస్తుంది. నిన్ను నమ్ముకొని మూడు బిగ్ సినిమాలు ఉన్నాయి ..త్వరగా రెస్ట్ తీసుకోని… కోల్కొని ఆరోగ్యం చెక్కపెట్టుకొ.. షూటింగ్లో పాల్గొను అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే పూజా హెగ్డే మాత్రం తన సొంత వైద్యాలు ఫాలో అవుతూ పరిస్ధితిని ని కంట్రోల్ తెప్పిస్తుంది. చూడాలి మరి ఆమె కాళ్ళగాయం ఎప్పుడు నయమవుతుందో? ఎప్పుడు సినిమా షూట్ స్టార్ట్ అవుతుందో..?