ఎస్ టాలీవుడ్లో గతంలో కూడా ఒక హీరోకు అనుకున్న టైటిల్‌తో మరో హీరో సినిమా తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఓ దర్శకుడు అనుకున్న టైటిల్‌ను మరో దర్శకుడి కోసం త్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ స్టార్ హీరో కోసం సదరు హీరో అభిమాని అయిన నిర్మాత రిజిస్టర్ చేసిన టైటిల్ ఇప్పుడు మరో స్టార్ హీరో కోసం ఓ దర్శకుడు వాడుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఇంట్రస్టింగ్ స్టోరీ తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్‌కు నిర్మాత బండ్ల గణేష్ ఎంత వీరభక్తుడో తెలిసిందే. స్టేజ్ మీద మైక్ దొరికితే చాలు వవన్‌ను ఓ కీర్తనలతో ముంచెత్తేస్తూ ఉంటాడు. బండ్ల తీన్మార్, గబ్బర్‌సింగ్ సినిమాల తర్వాత పవన్‌తో మళ్లీ సినిమా చేసేందుకు చాలా కాలంగా ట్రైల్స్ వేస్తున్నాడు. తాను పవన్‌ను ముద్దుగా దేవర అని పిలుచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే దేవర పేరుతో ఓ టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు.
అయితే రీసెంట్గా ఆ టైటిల్‌ను బండ్ల రెన్యువల్ చేసుకోవడం మర్చిపోయాడట. అయితే ఇప్పుడు అదే టైటిల్ దర్శకుడు కొరటాల శివ తీసేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ కొరటాల రిజిస్టర్ చేసి తన దగ్గర పెట్టుకున్నాట్ట. అయితే ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌తో కొరటాల తెరకెక్కించే సినిమా కోసం అన్న గాసిప్పులు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్నాయి.
అయితే కొరటాల ఇచ్చిన షాక్‌తో బండ్ల గణేష్ బిత్తరపోయి నేరుగా కొరటాలకే ఫోన్ చేసి ఇదేం పని అడిగినట్టు కూడా టాక్ ? తాను ఎప్పుడో అందరికంటే ముందుగానే కొరటాలకు అడ్వాన్స్ ఇచ్చానని.. ఇప్పటకీ తనకు సినిమా చేయకపోయినా ఆ గౌరవం కూడా లేకుండా ఇలా చేయడం ఏంటని ? బండ్ల తన సన్నిహితుల వద్ద కొరటాలపై ఫైర్ అవుతోన్నట్టు తెలుస్తోంది.
ఏదేమైనా పవన్ కళ్యాణ్ కోసం వీరభక్తుడు బండ్ల రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ కాస్తా ఇప్పుడు కొరటాల చేతుల్లోకి వెళ్లిపోయింది. మరి ఈ టైటిల్‌ను కొరటాల ఎన్టీఆర్ సినిమాకే వాడతాడా ? లేదా మరో సినిమాకా ? అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.