పవన్ కళ్యాణ్ బంగారం సినిమాతో మీరాచోప్రా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తమిళ్ లో ఎస్ జె.దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన అంబే ఆరూయిరే అనే చిత్రంతో నటించింది. మీరాచోప్రా బాలీవుడ్ హీరోయిన్స్ అయిన ప్రియాంక చోప్రా, మన్నార్ చోప్రా – పరిణితి చోప్రాకి కజిన్ అవుతుంది. ఈ చోప్రా ఫామిలీ నుంచి తన అక్కల ఆదర్శంతో హీరోయిన్ అవ్వాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఆమె చేసింది కేవలం 20 సినిమాలే అయినా అందులో కొన్ని గెస్ట్ అప్పియరెన్సులు కూడా ఉండటం విశేషం. ఇక వన్ అనే ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించిన మీరా తెలుగు, తమిళ్ లోనే ఎక్కువగా నటించింది.
ఇక ఈ మధ్యనే హాట్ స్టార్ కోసం టాటూ మర్డర్స్ అనే వెబ్ సిరీస్ కోసం లీడ్ రోల్ లో నటించి తనలో నటి అలాగే ఉందని నిరూపించుకుంది. ఈ సిరీస్ కి గాను మీరాకు మంచి పేరు లభించింది. ఇక ఈ ఏడాది మొగలి పువ్వు అనే హిందీ – తెలుగు సినిమాలోనూ, నాస్తిక్ అనే హిందీ సినిమాలోనూ నటిస్తోంది. ఈ రెండు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయ్. ఇక సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేని మేరకు పబ్లిసిటీ పిచ్చి కొంచం అని అంటూ ఉంటారు.
గతంలో ప్రియాంక చోప్రా – నేను మాత్రమే క్లోజ్ కానీ నాకు పరిణితి చోప్రాతో సంబంధం లేదు అంటూ మాటలు జారేసింది. ఈ విషయం అప్పట్లో బాలీవుడ్ లో పెద్ద సంచలనం అయ్యింది. కేవలం పబ్లిసిటీ కోసమే మీరా చోప్రా మీడియా ముందు అవాకులు చెవాకులు పేలుతూ ఉండటంతో బాలీవుడ్ లో అసలు అవకాశాలు రాలేదు. తెలుగులో సైతం జూనియర్ ఎన్టీఆర్ పైన ఒకసారి నోరు పారేసుకుంది. అసలు ఆ జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు అని.. తెలుసుకోవాలనుకోవడం లేదు అంటూ మీడియా ముందు చెప్పడం తో ఒక్కసారి నందమూరి ఫ్యాన్స్ అలాగే తారక్ ఫ్యాన్స్ ఆమెపై సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించారు.
మీరా చోప్రా కి బాలీవుడ్ తో సంబంధాలు ఉంటె మాత్రం తెలుగు లో ఉన్న స్టార్ హీరో పైన నోటికి వచ్చినట్టు మాట్లాడటం బాగాలేదు అంటూ ట్విట్టర్ సైతం పేలిపోయేలా ఆమె పై కామెంట్స్ వచ్చాయి.
ఎంత మంది ఏం మాట్లాడిన నాకేం సంబంధం లేదు అన్నట్టుగా కనీసం ఎవరికి క్షమాపణ కూడా చెప్పకుండా సైలెంట్ గా ఉండి చోద్యం చూసింది మీరా చోప్రా. ఇక తెలుగులో సైతం ఆ టైంలో అవకాశాలు తగ్గాయి. చేసేదేం లేక అన్ని సర్దుకొని బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడా ఎవరు పట్టించుకోక పోవడంతో ఈ అమ్మడు కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది.
చూడటానికి అందంగా ఉండే మీరాకు నోరు మాత్రం అందంగా లేదు అని… అన్ని భాషల్లో ఒక ముద్ర పడింది. ఇక ఇటీవల కాలంలో కరోనా టీకా విషయంలో కూడా ట్విట్టర్ లో ఒక పోస్ట్ వివాదం అయ్యింది మీరా. ఆ తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేసింది. తాను ఒక హీరోయిన్ అయ్యి ఉండి ఫ్రంట్ లైన్ వారియర్ అంటూ కరోనా వాక్సినేషన్ చేయించుకున్నాను అని చెప్పడంతో బీజేపీ ఆమెపై మండిపడింది.