సీనియర్ నటి, బహుముఖ ప్రజ్ఞాశాలి.. భానుమతి నటన అంటే ప్రేక్షకులు రెండు కళ్లు అప్పగించి చూసేవారు. ఇక, అన్నగారు ఎన్టీఆర్ – భానుమతి కాంబినేషన్‌లో వచ్చిన మల్లీశ్వరి సినిమా కూడా ఏడాది పాటు ఆడింది. దాదాపు ఐదు చోట్ల శత దినోత్సవం కూడా చేసుకుంది. మరి అలా మంచి కాంబినేషన్ అయినప్పటికీ.. తర్వాత వచ్చిన సినిమాల్లో భానుమతితో నటించేందుకు అన్నగారు ఇష్టపడలేదనే టాక్ ఉంది.
మల్లీశ్వరి విజయం తర్వాత.. అన్నగారికి మరోసారి అప్పటి దిగ్దర్శకుడు బీఎన్ రెడ్డి ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. కథ కూడా మంచిది ఎంచుకున్నారు. ఇక, ఎన్టీఆర్ ఓకే అంటే.. షెడ్యూల్ కూడా ప్రారంభించా లని నిర్ణయించారు. అయితే, కథ విన్నాక బాగానే ఉందన్న ఎన్టీఆర్.. హీరోయిన్ ఎవరు ? అని ప్రశ్నించారు. ఇంకెవరు భానుమతి అని రెడ్డిగారు సెలవిచ్చారు.
అయితే,తర్వాత ఆలోచించుకుని చెబుతాను… అని అన్నగారు తప్పించుకున్నారు. కట్ చేస్తే.. తర్వాత.. ఇక, ఈ సినిమాపై అన్నగారు ఆలోచించలేదు. దీనికి కారణం.. ఏంటో చాలా మందికి అప్పట్లో అర్థం కాలేదు. దీనికి కారణం.. చాలా రోజుల పాటు అన్నగారు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎందుకంటే.. అప్పటి బ్లాక్ అండ్ వైట్ ఇండస్ట్రీలో భానుమతి బలంగా ఉండేవారు.
ఇక, ఎటొచ్చీ.. అన్నగారు భానుమతిని తమ సినిమాలో ఎందుకు ? వద్దన్నారంటే.. చాలా రోజుల తర్వాత.. ఈ విషయాన్ని గుమ్మడి వెంకటేశ్వరరావుకు ఒక సందర్భంలో చెప్పారట. మల్లీశ్వరి సినిమాలో తాను బాగా నటించినప్పటికీ.. భానుమతి డామినేషన్ క్యారెక్టర్ వల్ల తన అభిమానులు నొచ్చుకుని తనకు లేఖలు రాశారని, వారి ని హర్ట్ చేయలేక తాను ఆసినిమా నుంచి తప్పుకొన్నానని చెప్పారట. ఇదీ.. సంగతి..!