అన్నగారు ఎన్టీఆర్‌కు కొన్ని కొన్ని విషయాల్లో అసలు మొహమాటం ఉండేది కాదు. సినిమాల విషయానికి వస్తే.. కొత్తలో ఎలా ఉన్నా.. తర్వాత కాలంలో మాత్రం ఆయన రెమ్యూనరేషన్ విషయంలో మొహమాటా లకు తావిచ్చేవారు కాదు. ప్రతి రూపాయిని తీసుకునేవారు. దీనికి కారణం.. తనకు కూడా కుటుంబం ఉందని, తను కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చెప్పేవారు. ఈ క్రమంలో ఆయన ప్రతి రూపాయిని వదలకుండా తీసుకునేవారు.
అదేవిధంగా అన్నగారు.. భోజనం విషయంలోనూ మొహమాట పడేవారు. ఇప్పటి మాదిరిగా ఏరి కోరి.. డైటీషియన్లు చెప్పినట్టు హీరోలు తినే భోజనంలా కాకుండా.. ఫక్తు తెలుగు సంప్రదాయ రుచులకు అన్నగారు పెద్దపీట వేసేశారు. ఎవరో ఏదో అనుకుంటారని కూడా ఆయన ఏమాత్రం మొహమాటపడేవా రు కాదు. ముఖ్యంగా బ్రాహ్మణ భోజనాలంటే అన్నగారు మనసు పెట్టేశారు.
అలాగని నాన్ వెజ్‌కు ప్రాధాన్యం లేదని కాదు. అన్నగారికి తొలి నుంచి వారితో పరిచయాలు ఎక్కువ.
అందుకే.. సుసర్ల దక్షిణామూర్తి, సూర్యాకాంతం, పద్మనాభం వంటి వారితో ఎక్కువగా చనువు ఉండేది. వారి ఇళ్లలో జరిగేవేడుకలకు ఖచ్చితంగా హాజరయ్యేవారు. ఇలాంటి పరిచయాలతో చనువు ఏర్పడిన తర్వాత.. వారితో తన మనసులోని కోరికలు కూడా చెప్పి వాటిని తీర్చుకునేవారట.
అప్పట్లో తమిళనాడులో షూటింగులు జరిగే సమయంలో అన్నీ స్టూడియోల్లోనే సెట్లు వేసి తీసేవారు. ఇక, అక్కడే బ్రేక్ సమయంలో భోజనాలు చేసేవారు.ఈ క్రమంలో ప్రత్యేకంగా సూర్యాకాంతం వంటివారు.. అన్నగారికి ఇష్టమైన వంటకాలు చేయించి మరీ తెచ్చేవారు. వీటిలో ఖచ్చితంగా గుత్తి వంకాయ కూర ను అన్నగారు ఇష్టపడేవారు. అంతేకాదు. సాదారణంగా గుమ్మడికాయతో పుసులు పెడతారు. కానీ, అప్పట్లో సూర్యాకాంతం ఇంట్లో గుమ్మడికాయతో చారు పెట్టేవారట.
దీనిని ఆమె ఒకసారిప్రయోగం కోసమని తీసుకువచ్చారు. దీనిని ఎంతో ఇష్టపడ్డ అన్నగారు.. షూటింగ్ ముగిసేవరకు కూడా నాలుగుగైదు నెలల పాటు వారానికి రెండు సార్లు ఈ వంటకాలు తీసుకురమ్మని రిక్వస్ట్ చేసి మరీ తెప్పించుకుని ఆరగించేవారట. ఇక, వడియాల సంగతి వేరే చెప్పాలా!! ఇదీ అన్నగారి అలవాటు.