అన్నగారు ఎన్టీఆర్ నటులు మాత్రమే కాదు.. సినీరంగంలో లబ్ధప్రతిష్టులు. అనేక విభాగాల్లో ఆయన తనదైన అనుభవాన్ని ప్రదర్శించారు. ఆయన సోదరుడు త్రివిక్రమరావు.. టెక్నాలజీకి పెట్టిందిపేరు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అన్నగారి చెప్పడం.. దానిని తెలుగు తెరకు పరిచయం చేయడం, మంచి సాంకేతిక నిపుణులను కూడా మద్రాస్‌కు తీసుకురావడం అప్పట్లో గొప్పగా ఉండేది.
ఇక, అన్నగారు సినీరంగంలో దర్శకుడు, నిర్మాత కూడా…! రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ నిర్మించి తన బ్యానర్‌పై అనేక భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించారు. అలాగే అనేక సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇలా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో మొదట్లో ఎక్కువగా తొలిసారి తెరకు పరిచయమైన వారికి ప్రాధాన్యం ఉండేది. ఇలా హరినాథ్, గిరిజ, గీతాంజలి వంటి అప్పటి తరం కొత్తవారికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవారు.
అయితే, అన్నగారి డైరెక్షన్ అంటే.. ఇష్టపడినా.. అన్నగారు పెట్టిన కండిషన్లకు మాత్రం వీరంతా హడలి పోయేవారట. అప్పట్లో హీరోయిన్లకు కూడా భర్త, కుటుంబం ఉండేవి. ఇప్పుడంటే.. సినిమాల్లో ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ, అప్పట్లో ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకువారు. ఇలాంటివా రికి ఇంట్లో పనులు కూడా ఉండేవి ఇది సహజం కదా..!
అయితే, అన్నగారు మాత్రం టైం అంటే టైమే. దీంతో సమయానికి షూటింగులకు రాకపోతే.. ఖసురుకునేవారట. అంతేకాదు.. “ చూచారా మీరు లేటు కావడంతో అందరూ నష్టపోయారు “ అని వ్యాఖ్యానించేవారట. దీంతో అన్నగారి సినిమాల్లో నటించేందుకు ఇష్టం ఉన్నా.. ఆయన పెడుతున్న టైం కండిషన్‌కు నటీమణులు హడలిపోయేవారట.
ఇక, సూర్యాకాంతం అయితే.. `వద్దులే బాబూ.. నేను నువ్వు చెప్పిన టైం రాలేను. మేం బ్రాహ్మలం. మా ఇంట్లో పూజ, మడి, ఆచారం చూసుకుని రావాలి“ అని తెగేసి చెప్పిన సందర్భాలు.. వదులుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. నీకు నీ సినిమాకో దండం బాబు అని కూడా ఆమె ఓపెన్‌గానే అనేసేవారట. అందుకే అన్నగారు డైరెక్షన్ చేసిన సినిమాల్లో సూర్యాకాంతం తక్కువుగా మాత్రమే కనిపిస్తారు.