సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అజరామరమైన అనేక సినిమాలు చేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా కూడా కీర్తిని సొంతం చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ కన్నా ముందుగానే ఇండస్ట్రీలోకి వచ్చారు అలనాటి ఫైర్ బ్రాండ్ నటి భానుమతి. నటన, డ్యాన్స్, పాటలు పాడడం, సినిమాలకు దర్శకత్వం వహించడం.. నిర్మాతగా కూడా భానుమతి అన్నిరంగాల్లోనూ ప్రవేశించారు.
దీనికితోడు కంచుకంఠం. పైగా.. ఎవరినీ దరిచేరనివ్వరనే మాట. అంటే.. ఇప్పటి మాదిరిగా హీరోలు.. హీరో యిన్లను వాటేసుకోవడం.. ఇతరత్రా అనేవి అప్పట్లో ఉండేవి కాదు. అయినా కూడా భానుమతి మరింత స్ట్రిక్టుగా ఉండేవారు. అసలు ఏమీ లేకపోయినా.. కనీసం పాటల సమయంలోనూ ఆమె చేయి తాకనిచ్చేవా రు కాదు. మల్లీశ్వరి సినిమాలో అన్నగారితో కలిసి భానుమతి నటించారు. ఒక సందర్భంలో ఇద్దరూ కౌగిలించుకునే సన్నివేశం ఉంది.
కానీ, భానుమతి చేయనన్నారు. ఆ సీన్ లేకుండానే సినిమా ముందుకు సాగిపోయింది. ఇక, ఈ సినిమాలో భానుమతికి 20 వేల రూపాయల పారితోషికం ఇస్తే.. అన్నగారికి కేవలం 12 వేలతో సరిపెట్టారట. నిజానికి అప్పట్లో నెలవారీ జీతాలు ఉండేవి. కానీ, భానుమతి మాత్రం నెలజీతానికి చేయలేదు. అందుకే ఆమెకు పారితోషికం ఇచ్చేవారు. ఈ క్రమంలోనే అన్నగారికి ఇచ్చారు.
అయితే.. ఈ విషయంలో ఆదిలో అన్నగారు హర్ట్ అయ్యారు. భానుమతి కన్నా.. ఏం తక్కువ ? అని ప్రశ్నించారు. అయితే.. అసలు భానుమతి ఉంది కాబట్టే ఈ సినిమా తీస్తున్నారు. కథ అంతా కూడా ఆమె చుట్టూనే తిరుగుతుంది. అని దర్శకుడు నచ్చ జెప్పి.. అన్నగారితో నటింపజేశారు. అయితే ఆ తర్వాత కూడా భానుమతి అంటే ఎన్టీఆర్ ఎంతో గౌరవించేవారు.
ఎన్టీఆర్‌తో ఎన్నో సినిమాల్లో నటించిన భానుమతి ఆ తర్వాత ఆయన తనయుడు బాలయ్య సినిమాల్లోనూ నటించింది. మంగమ్మగారి మనవడు సినిమాలో భానుమతి నటించారు. అయితే ఈ సినిమాలో భానుమతిని తీసుకునేందుకు ఎన్టీఆర్ ఓ కండీషన్ పెట్టారట. భానుమతి షూటింగ్‌క వచ్చిన వెంటనే ముందుగా బాలయ్యే స్వయంగా వెళ్లి కారు డోర్ తీసి ఆమెను సెట్స్‌లోకి తీసుకురావాలని చెప్పారట. అంతలా భానుమతిని ఎన్టీఆర్ గౌరవించేవారు.