ప్రస్తుతం ఏ సినీ పరిశ్రమను పలకరించినా.. వినిపించే మాట క్యాస్టింగ్ కౌచ్. మహిళా నటులను వేధించడ మో.. లేక శృంగారం కోసం వారిని మచ్చిక చేసుకోవడమో.. అనేది ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. అంటే అవకాశాల కోసం హీరోయిన్లను పక్కలోకి రప్పించుకోవడం. వారు కూడా తమకు ఛాన్సులు వస్తున్నాయని రాజీపడడం. దీని పై ఇప్పటికే శ్రీరెడ్డి వంటి వారు బహిరంగ విమర్శలు కూడా చేశారు. అంతేకాదు.. అనేక మంది బాలీవుడ్ నటీమణులు కూడా ఇటీవల కాలంలో దీనిపై పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చారు.
అటు తమిళనాడులో సింగర్ చిన్మయి కూడా కాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా మాట్లాడి దీనికి ప్రాచుర్యం కల్పించారు. ఇక ఇప్పుడు వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కాస్టింగ్ కౌచ్ అంటూ తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి ఓపెన్ అవుతున్నారు. మరి ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇప్పుడేనా.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో లేదా? అనే సందేహం వస్తుంది. కానీ, లేదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అసలు లేనే లేదు. ఎందుకంటే.. అప్పట్లో నటీనటులు కుటుంబ సభ్యు లుగా ఉండేవారు.
ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునేవారు. కేవలం స్కిన్ షోలకు ప్రాధాన్యం ఇచ్చే వారు కాదు. నటనకు మాత్రమే అప్పట్లో ప్రాధాన్యం ఉండేది. ఒకరిద్దరు దర్శకులు, హీరోయిన్లు, హీరోలు, హీరోయిన్ల మధ్య ఉన్నా అది వారి ఇష్టం మేరకు జరగడంతో బయటకు వచ్చేవే కాదు. మద్రాస్ పత్రికలు కూడా కొన్ని గుసగుసలు అంటూ వార్తలు రాసినా వాటిని ఎవ్వరూ పట్టించుకునే వారే కాదు.
అప్పట్లో తెరమీద కనిపించిన నటీమణులు ఏదో ఒకరంగంలో ప్రావీణ్యం సొంతం చేసుకుని ఉండేవారు. నటనో.. నాట్యమో.. గాయకులుగా నో..ఇలా.. ఏదో ఒక రంగంలో గుర్తింపు పొందేవారు. ఉదాహరణకు.. భానుమతిని తీసుకున్నా.. సావిత్రిని తీసుకున్నా.. ఎస్. వరలక్ష్మిని పరిశీలించినా.. వారిలో ప్రత్యేక టాలెంట్ ఉంది. భానుమతి పాటలు పాడడంలోనే కాకుండా నాట్యంలోనూ ప్రావీణ్యురాలు.
ఇక, సావిత్రి నృత్యంలో మాస్టర్ డిగ్రీ సొంతం చేసుకున్నారు. ఎస్. వరలక్ష్మి సంగీత దర్శకురాలు, పాటలు పాడడంలోనూ.. రాయడంలోనూ గుర్తింపు పొందారు. ఇలా.. స్కిన్ షోకు ప్రాధాన్యం ఉండేది కాదు. దీంతో అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్‌కు ప్రాధాన్యం లేదు. ఇక, ఈ విషయం అప్పట్లో ప్రస్తావన లేకపోవడం.. ఎన్టీఆర్ , ఏఎన్నార్ సహా ఎవరూ దీని గురించి పెద్దగా మాట్లాడేవారు కాదు.