సూపర్‌స్టార్ కృష్ణ మరణం యావత్ సినీ ప్రపంచాన్నే కాకుండా… తెలుగు ప్రజలందరిని ఎంతో బాధపెట్టింది. నిన్నటి తరం గొప్పనటుల్లో ఒకరిగా ఉన్న కృష్ణకు తెలుగు ప్రజలకు మధ్య ఎంతో సెంటిమెంట్ ఉండేది. అయితే కృష్ణ పార్థీవదేహం సాక్షిగా ఆయన రెండో భార్య విజయనిర్మల కుమారుడు నరేష్ వ్యవహరించిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు కృష్ణ పార్థీవదేహం పక్కన ఉండగా నరేష్ పవిత్రా లోకేష్‌ను వెంటేసుకుని రావడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కృష్ణకు నరేష్ అంటే అస్సలు ఇష్టం ఉండదని రామారావు చెప్పారు. అయితే కేవలం విజయనిర్మలపై ఉన్న ప్రేమతోనే నరేష్‌ను ఆయన కొడుకుగా స్వీకరించాల్సి వచ్చిందని కూడా అన్నారు.
అసలు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని.. ఇప్పుడు పవిత్రా లోకేష్‌తో సహజీవనం చేస్తూ ఆమెను అక్కడకు తీసుకు వచ్చాడని.. చూసేవాళ్లకు కూడా ఇది బాగోలేదని… అసలు కృష్ణ గారి పేరు ఏమైపోతుంది.. ఇలాంటి పనులు ఎవరికి ఇష్టం ఉంటాయని రామారావు ఫైర్ అయ్యారు. నరేష్ కూడా కృష్ణగారిపై ప్రేమతో భోరున ఏడుస్తున్నాడు కదా ? అంటే ఆ ప్రేమను ఎవ్వరూ తప్పుపట్టరని.. అసలు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తోన్న పవిత్రా లోకేష్‌ను అక్కడకు తీసుకువెళ్లకపోతే వచ్చే నష్టం ఏంటని కూడా ప్రశ్నించారు.
నరేష్ చేసింది చాలా తప్పు… మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. ఇప్పుడు సహజీవనం చేస్తూ ఆ అమ్మాయిని తండ్రి మృతదేహం వద్దకు తీసుకువెళ్లాడు. అసలు అన్న చేసిన పనికి అంతమందిలో మహేష్‌బాబు తలదించుకోడా ? అని కూడా రామారావు ఫైర్ అయ్యారు. అసలు ఇలా చేసేముందు సిగ్గు ఉండవద్దా ? అసలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కూడా రామారావు చెప్పారు.
నరేష్ వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా.. నరేషే ఎప్పుడూ కృష్ణతో ఉండేవారన్నది నిజం. విజయనిర్మలతోనే కృష్ణ చివరి వరకు ఉండడంతో ఆ ఇంట్లోనే ఉన్న నరేష్ కృష్ణ ఆరోగ్యం, ఇతర బాగోగులు చూసుకున్నాడు. కృష్ణ కూడా తనకు ఏం కావాలన్నా నరేష్‌నే అడిగేవారు.