తెలుగు సినిమా సూపర్‌స్టార్ మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మాజీ మిస్ ఇండియా. మహేష్ – నమ్రత ప్రేమ, పెళ్లి అప్పట్లో ఓ సంచలనం. మహేష్ చాలా సైలెంట్‌గా ఉంటాడు. మనోడు అమ్మాయిల కలల రాకుమారుడు అయినా కూడా నిజంగానే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు ? అని ఎవ్వరూ ఊహించలేదు. అయితే వయస్సులో తనకన్నా పెద్ద అయిన మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌తో ప్రేమలో పడడంతో పాటు ఇంట్లో వాళ్లకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడు.
నమ్రత – మహేష్ కలిసి 2000లో వచ్చిన వంశీ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా కోసం ఆస్ట్రేలియాలో దర్శకుడు బి. గోపాల్ 40 రోజుల లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ టైంలో వీరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. చివరకు ఐదేళ్ల ప్రేమ తర్వాత 2005లో ముంబైలో ఓ గుళ్లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ దంపతులకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు.
మహేష్ లైఫ్‌లోకి నమ్రత వచ్చాక మనోడి కెరీర్ చాలా మార్పులకు కారణమైంది. మహేష్ – నమ్రత చాలా రొమాంటిక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ కంటే పెళ్లికి ముందే నమ్రత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్. 2000 టైంలో ఆమె ఫామ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌దత్‌తో ఆమె ప్రేమలో పడిందని అంటారు.
సంజయ్‌దత్ మాఫియా వ్యవహారాల్లో ఉన్నప్పుడు కూడా నమ్రత అతడితో ప్రేమలో ఉందనే టాక్ ? ఆ తర్వాత బాలీవుడ్ నటుడు, స్టార్ దర్శకుడు మహేష్ మంజ్రేకర్‌తో ప్రేమలో పడడంతో పాటు వీరిద్దరు కలిసి కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశారన్నది బాలీవుడ్లో పాపులర్ అయిన గాసిప్. వీరిద్దరు చాలా రోజుల పాటు కలిసే ఉన్నారని టాక్ ? వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాస్తవ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాతే వీరి మధ్య బంధం బలపడి డేటింగ్ వరకు వెళ్లిందట. ఆ తర్వాత మహేష్‌తో వంశీ సినిమా చేయడం… ప్రేమ, పెళ్లి, పిల్లలతో ఆమె లైఫ్ ఇప్పుడు చాలా కలర్ ఫుల్‌గా వెళుతోంది.