అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య గత ఏడాది స్టార్ హీరో సమంతతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2010లో వచ్చిన ఏ మాయ చేసావే సినిమా టైం నుంచి మీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ మనం సినిమా టైమ్ కి ముదిరి పాకాన పడింది. ఏడెనిమిది సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి చేసుకుని ఐదేళ్లపాటు కాపురం చేశారు.
విడాకులకు ఆరేడు నెలల ముందు వరకు కూడా కలిసే ఉన్నా చైతు – సమంత మనస్పర్ధలు నేపథ్యంలో విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. సమంతతో చైతు విడిపోయినప్పటి నుంచి మనోడి పర్సనల్ లైఫ్ లో చాలా రూమర్లు తెరపైకి వస్తున్నాయి. మేజర్ సినిమాతో పాపులర్ అయిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్లతో చై డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై చైతు స్పందించకపోయినా శోభిత రెండు మూడు సార్లు పరోక్షంగా స్పందించింది.
అవన్నీ అబద్ధం అని క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. తమ డేటింగ్ పై ఎన్ని వార్తలు వచ్చిన చైతు మాత్రం చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకోబోతున్నాడు. అయితే తాజాగా నాగచైతన్య – శోభిత కలిసున్న ఒక ఫోటో నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజనులు మొత్తానికి ఇద్దరు తమ మధ్య ఏం లేదని చెబుతున్నా ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుందని అందుకు ఈ ఫోటోయే కారణం అని కామెంట్లు చేస్తున్నారు.
చై అమీర్‌ఖాన్‌తో నటించిన లాల్‌సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో కూడా శోభిత గురించి అడిగితే చిన్న స్మైల్‌తో ఆన్సర్ దాటవేశారు. మీ ప్రజెంట్ రిలేషన్ ఏంటన్న ప్రశ్నకు బదులు ఇస్తూ హ్యాపీ స్టేటస్ అని చెప్పాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటో నిజమైన ఫొటోనా లేదా ఎడిటింగ్ చేసిన ఫొటోనా అన్నది మాత్రం తేలాల్సి ఉంది.