Newsమెగా డాటర్లకి మొగుడ్లు కలిసిరారా..? ఆడపిల్లలకే ఎందుకు ఇలా..?

మెగా డాటర్లకి మొగుడ్లు కలిసిరారా..? ఆడపిల్లలకే ఎందుకు ఇలా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న అంశాలలో మెగా డాక్టర్ల పెళ్లి మ్యాటర్లు కూడా ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తన కుటుంబాన్ని సింగిల్ హ్యాండ్ తో పైకి వచ్చేలా చేసాడు . కాగా అబ్బాయిల విషయంలో ఏ రోజు ఆలోచించిన చిరంజీవి మెగా డాటర్ల విషయంలో మాత్రం తెగ ఆలోచిస్తున్నారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ ముద్దుల కూతురు శ్రీజ సోషల్ మీడియా ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది .

మనకు తెలిసిందే శ్రీజ కొన్ని అనివార్య కారణాల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చేసింది . రెండో భర్తకు విడాకులు ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా.. దానిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కాగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక సైతం భర్తను దూరం పెడుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికి అఫీషియల్ ప్రకటన రాలేదు. చిరంజీవి సిస్టర్ సాయి ధరమ్ తేజ్ అమ్మగారు సైతం రెండో పెళ్ళి చేసుకున్నారు. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

ఈ క్రమంలోనే కొందరు మెగా హెటర్స్ మెగా డాటర్ ల పై వల్గర్ కామెంట్స్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు . ఇలాంటి క్రమంలోనే మెగా ఫాన్స్ వాళ్ళను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో మొగుడ్లను వదిలేసిన అమ్మాయిలు లేరా..? మెగా డాటర్ లు ఒక్కటే విడాకులు ఇచ్చారా ..? మిగతా వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదా ..? మరి ఎందుకు మెగా డాటర్ లని తప్పుపడుతున్నారు..? దమ్ముంటే ఇండస్ట్రీలో జరిగే తప్పులను వేళు ఎత్తి చూపండి.. ఇలా ఆడపిల్లల పై తప్పుడు నిందలు వేయకండి.. వాళ్ళ లైఫ్ లో ఉన్న ఇబ్బందుల కారణంగా వాళ్ళు డివర్స్ తీసుకున్నారు. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందన్న విషయం ఎవరికీ తెలియదు ..తప్పు ఎవరిదైనా కావచ్చు.. ఇలా నిజం తెలియకుండా ఒకరిపై నిందలు వేయడం కరెక్ట్ కాదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. కాగా శ్రీజ మూడో పెళ్లికి సిద్ధం పడింది అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఏది..ఏక్కడ.. పెళ్లి చేసుకున్న ఫోటోలు లేవే..? సో ఈ వార్తల్లో నిజం లేదు. అంతేకాదు నిహారిక సైతం భర్తను దూరం పెట్టింది..డివర్స్ తీసుకుంటుంది అంటూ తెగ చించుకుంటున్నారు.. ఇప్పటి వరకు నీహారిక ఆ ఊసే ఎత్తలేదు సరికదా.. ఇప్పటికి భర్త తో హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది . ఇలా కొందరు మెగా డాక్టర్ల పేర్లు చెప్పుకొని ట్రోల్ చేసి ఆ డబ్బులతో బతికేస్తున్నారు అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు మెగా ఫ్యాన్స్..!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news