బాలయ్య క్రేజీ టాక్ షో అన్‌స్టాపబుల్‌లో హోస్ట్‌ల ముచ్చట్లే కాదు.. మధ్య మధ్యలో బాలయ్య ఫ్యామిలీ, పర్సనల్, సినిమా ముచ్చట్లు కూడా బయటకు వస్తున్నాయి. ఓవరాల్‌గా షోను బాలయ్య ఆద్యంతం రక్తి కట్టిస్తున్నాడనడంలో సందేహం లేదు. ఈ వారం మూడో ఎపిసోడ్‌కు గెస్టులుగా యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ వచ్చారు. ఈ ఎపిసోడ్లో ఇద్దరు కుర్ర హీరోలను బాలయ్య బాగానే ఆడుకున్నాడు.
తాజా ఎపిసోడ్లో అడవిశేష్ని నువ్వు నీ సినిమాల్లో ఫస్ట్ కిస్ ఎవరికి ? ఇచ్చావు అనగానే ఆదాశర్మ అని చెప్పాడు. అలాగే లాస్ట్ కిస్ హిట్ 2 హీరోయిన్ మీనాక్షి చౌదరికి ఇచ్చానని చెప్పాడు. అయినా బాలయ్య అడవి శేషును వదలకుండా నువ్వు ఫ్యూచర్లో ఎవరికి కిస్ ఇవ్వాలనుకుంటున్నావు అని మరింతగా రెచ్చగొట్టాడు. దీంతో కాస్త ఆలోచించి బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పేరు చెప్పాడు. అసలు కిస్ చేయకూడదనుకుంటున్న హీరోయిన్ ఎవరు ? అన్న ప్రశ్నకు వెంటనే అలియా భట్ పేరు చెప్పాడు.
పక్కనే ఉన్న శర్వా అదేంటి అలియానా అంటూ కాస్త అమాయకంగా ఫేస్ పెట్టగా వెంటనే అడవి శేషు మొన్నే కదా పెళ్లి అయిపోయింది అని చెప్పాడు. మరి కత్రినాకు పెళ్లి అవ్వలేదా ? అంటూ శేషును ఆటపట్టించాడు. అలా ఈ ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. ఇక ఈ ఇద్దరు హీరోలు బాలయ్యను మీ సినిమాలలో ఎవరికి అయినా లిప్‌కిస్ ఇచ్చారా ? అని షాకింగ్ ప్రశ్న వేశారు. అయితే బాలయ్య బొబ్బిలి సింహం సినిమా షూటింగ్లో హీరోయిన్ మీనాతో జరిగిన ఓ ఇన్సిడెంట్ చెప్పారు.
బొబ్బిలి సింహం సినిమా షూటింగ్ వేమూరు గట్టు మీద జరుగుతోందట. ఓపెనింగ్ షాట్‌ను సూపర్‌స్టార్ రజనీకాంత్ క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. రజనీకాంత్ క్లాప్ కొట్టగా బాలయ్య సీరియస్‌గా డైలాగ్ చెపుతున్నారట. తర్వాత దర్శకుడు కోదండ రామిరెడ్డి అవుట్ ఫీల్డ్ నుంచి వచ్చి బాలయ్య బుగ్గ మీద ముద్దు పెట్టేలా ప్లాన్ చేశారట షాట్. అయితే మీనా రావడం ఆలస్యం కావడంతో బాలయ్య డైలాగ్ చెప్పి సీరియస్‌గా ఇటు వైపు తిరిగాడట.
వెంటనే మీనా అటు వైపు నుంచి పరిగెత్తుకు వచ్చిందట. దీంతో ఇద్దరి లిప్లు దగ్గరకు వచ్చాయట. దీంతో మీనా కెవ్వుమని అరిచిందట. పక్కనే ఉన్న రజనీకాంత్ షాక్ అయ్యారట. అలా ఆ ఫన్నీ ఇన్సిడెంట్ను బాలయ్య చెప్పారు.