టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మీనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకి కోలీవుడ్ హీరోయిన్ అయినా సరే తెలుగులో మంచి మంచి అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది . అప్పట్లో మీనా కాల్ షీట్స్ కోసం టాలీవుడ్ స్టార్స్ అందరూ వెయిట్ చేసే వాళ్ళు. ఆమెతో ఒక్క సినిమాలోనైనా నటించాలి అని ఆశపడేవారు . అంతలా తన క్రేజ్ ను ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది . మీనా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది . ఎంత అందంగా ఉంటుందో.. అంతకన్నా గొప్ప మనసు.
మంచి మనస్తత్వం ఉన్న నటి . అందుకే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా మీనాతో సినిమా చేయడానికి ఇష్టపడతారు. కాగా మీనా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యాసాగర్ ను పెళ్లి చేసుకున్న మీనా.. కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. పూర్తిగా సినీ ఇండస్ట్రీని మర్చిపోయింది. కానీ ఈ మధ్య రీసెంట్ గానే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మీనా కి హస్బెండ్ చాలా సపోర్ట్ చేశాడు . కానీ ఎవరు ఊహించని విధంగా ఆయన అనారోగ్య కారణంగా మరణించారు.
ఇంత చిన్న ఏజ్ లోని మీనా లైఫ్ ఇలా మారిపోవడంతో జనాలు షాక్ అయ్యారు . మీనాకు ఒక పాప కూడా ఉంది. ఆమె నిద్రలో డాడీ డాడీ అంటూ ఏదుస్తుందట. ఈ క్రమంలోనే మీనాను రెండో పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారట. అయితే మొదటి నుంచి రెండో పెళ్లికి ఇష్టపడని మీనా.. కూతురు బాధను చూడలేక రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడిందట. ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్ అయినా
ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందట . విద్యాసాగర్ బ్రతికున్నప్పుడు కూడా ఆయన ఇంటికి వచ్చేవాడట. మీనా కూతురు అంకుల్ అంకుల్ అంటూ క్యూటుగా పిలిచేదట. ఈ క్రమంలోనే కూతురికి దగ్గరైన ఆయనని పెళ్లి చేసుకుని .. మీనా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిందట. ఏది ఏమైనా సరే మీనా తీసుకున్న నిర్ణయాని రైట్ అంటూ కొందరు చెప్పుతుంటే..మరికొందరు జనాలు ట్రోల్ చేస్తున్నారు.