మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ ఎప్పుడో ఐదారేళ్ల క్రిందటే ఎండ్ అయిపోవాల్సింది. బెంగాల్ టైగర్ యావరేజ్ అవ్వడంతో ఎలాగోలా గట్టెక్కేశాడు. ఆ తర్వాత మళ్లీ కెరీర్ అయిపోయిందనుకుంటోన్న టైంలో 2017లో రాజా ది గ్రేట్ రావడంతో ఎలాగోలా గట్టెక్కేశాడు. ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే రవితేజ కెరీర్ గత పదేల్లుగా ఒక్క హిట్.. నాలుగైదు ప్లాపులు అన్నట్టుగా సాగుతోంది.
రాజా ది గ్రేట్ తర్వాత కూడా రవితేజను జనాలు మర్చిపోయారు. అయితే కరోనా టైంలో వచ్చిన క్రాక్‌తో రవితేజ కెరీర్‌కు మళ్లీ ఊపు వచ్చింది. ఆ తర్వాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ రెండూ పెద్ద డిజాస్టర్లు. అయితే రెమ్యునరేషన్ మాత్రం రు. 18 – 20 కోట్ల రేంజ్‌లో ఉంది. సినిమాలు ఎన్ని ప్లాపులు అవుతున్నా కథలు పట్టించుకోకుండా రెమ్యునరేషన్ మీదే రవితేజ కాన్‌సంట్రేన్ చేస్తున్నాడన్నది నిజం అని ఇండస్ట్రీ టాక్ ?
ఇక ఇప్పుడు రవితేజ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. టీజర్లు బాగా వైరల్ అయ్యాయి పెళ్లిసందడి తర్వాత శ్రీలీల నటిస్తోన్న సినిమా ఇదే. ఇక రవితేజ తాజా మార్కెట్ ఆంధ్రాలో రు. 20 కోట్లు, నైజాంలో రు. 6 కోట్ల రేంజ్‌లో నడుస్తోంది. నాన్ థియేటర్ రైట్స్ రు. 20 కోట్ల రేంజ్‌లో అమ్ముతున్నారు. అందువల్లే నిర్మాతలు గట్టెక్కుతున్నారు. అయితే ఖిలాడీ, రామారావు రెండు సినిమాలకు భారీ నష్టాలు తప్పలేదు.
ఇప్పటికే రవితేజ సినిమాను అడ్వాన్స్‌లు ఇచ్చి కొనేందుకు చాలా చోట్ల ముందుకు రావడం లేదు. కనీసం ధమాకా అయినా హిట్ అయితేనే రవితేజ కెరీర్ కొన్నాళ్ల పాటు కంటిన్యూ కావచ్చు. అసలే ఇప్పుడు స్టార్ హీరోలకే థియేటర్ మార్కెట్ పడిపోతే లేవడం చాలా కష్టంగా ఉంది. ఎప్పుడో నాలుగైదు సినిమాలకు ఓ సారి హిట్ వచ్చే రవితేజ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఏదేమైనా ధమాకా ఫలితం తేడా కొడితే రవితేజ కెరీర్ ఎండ్ అయిపోయినట్టే..!