మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఖలేజా లాంటి ప్లాప్ సినిమా తీసినా కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలే వచ్చాయి. అయితే త్రివిక్రమ్ కెరీర్లో ఎప్పుడూ లేనట్టుగా అజ్ఞాతవాసి సినిమా విషయంలో మాత్రం తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఫ్రెంచ్ సినిమా లార్గోవిచ్‌కు అచ్చు గుద్దినట్టు కాపీ కొట్టేశాడు.
ఈ సినిమాను ముందు నుంచి ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. చివరకు రిలీజ్ అయ్యాక కూడా త్రివిక్రమ్ లార్గోవిచ్ నుంచి లైన్ టు లైన్ లేపేశాడని అందరికి తెలిసిపోయింది. అయితే త్రివిక్రమ్ గత సినిమాలు కూడా పాత సినిమాల లైన్లను పోలి ఉంటాయి. నితిన్ అ.. ఆ సినిమా విజయనిర్మల డైరెక్ట్ చేసిన మీనాను పోలి ఉంటుందని టాక్ వచ్చింది. ఇక అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో కూడా పాత సినిమాల చాయలు కనిపిస్తాయి.
అయితే మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ తీసిన సినిమా అతడు. త్రివిక్రమ్ కెరీర్లో రెండో సినిమా.. మహేష్‌తో తొలి సినిమాగా వచ్చిన అతడు సినిమాను జయభేరీ ఆర్ట్స్ బ్యానర్‌పై సినీ నటుడు మురళీమోహన్ నిర్మించారు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మెయిన్ లైన్ రైళ్లో చనిపోయిన ఓ వ్యక్తి ప్లేస్‌లో ఆ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సమస్యలు ఎలా పరిష్కరించాడు ? అన్నదే మెయిన్ లైన్.
ఇక త్రివిక్రమ్ తాను ఎంత పెద్ద హిట్ సినిమా తీసినా కూడా మెయిన్ లైన్‌ను ఏదో ఒక పాత సినిమా నుంచి స్ఫూర్తిగా తీసుకుంటాడు. అతడు మెయిన్ లైన్‌ను కూడా నాగార్జున హిట్ సినిమా నుంచి ప్రేరణగా తీసుకున్నాడన్న టాక్ ఉంది. ఆ సినిమా ఏదో కాదు రాముడొచ్చాడు. 1996లో ఏ. కొదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవళి, సౌందర్య హీరోయిన్లు.
ఈ సినిమాలో హీరో అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. రామ్ పాత్రలో నటించిన నాగార్జున కకక్షలతో విడిపోయిన తమ బంధువులతో పాటు గ్రామాలను కలుపుతాడు. త్రివిక్రమ్ కూడా ఈ లైన్ నుంచి స్ఫూర్తి పొందే అతడు మూలకథ రెడీ చేసుకుని.. దానిని డవలప్ చేసుకున్నాడన్న టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అతడు మంచి సినిమాయే అయినా ఓవర్ బడ్జెట్‌తో అప్పట్లో కమర్షియల్‌గా అనుకున్న లాభాలు అయితే తెచ్చిపెట్టలేదు.