మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్లో 12 ఏళ్ల తర్వాత సినిమా అనగానే మహేష్, త్రివిక్రమ్ అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు సినీ అభిమానులు అందరూ వావ్ అని సంబరపడిపోయారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే పెను సంచలనమే అని.. మనం మంచి సినిమాను చూడబోతున్నాం అని ఫీలైయ్యారు. దాదాపు ఆరేడు నెలలుగా అదిగో ఇదిగో అంటున్నా ఇప్పటకీ ఈ సినిమా అయితే సెట్స్ మీదకు వెళ్లలేదు.
అసలు త్రివిక్రమ్ కథ మహేష్‌కు నచ్చలేదని… సెకండాఫ్‌పై మహేష్ చాలా కంప్లైంట్లు చెప్పాడని.. అప్పుడే త్రివిక్రమ్‌కు, మహేష్‌కు మధ్య కాస్త తేడా కొట్టిందన్న ప్రచారం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు మరో కష్టం వచ్చిందట. హీరోయిన్ పూజా హెగ్డే మేకర్స్‌కు చుక్కలు చూపించేస్తోందంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ముక్కుతూ మూలుగుతూ తీశారు.
ఇప్పుడు రెండో షెడ్యూల్ తీయాలంటే ఖచ్చితంగా పూజా రావాల్సిందే. మహేష్ – పూజ కాంబినేషన్లో సీన్లకు ఆమె ఉండాలి. అయితే ఆమె ఓ ఫంక్షన్లో కాలు మెలికి పడి కింద పడడంతో గాయమైంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నారు. ఆమె ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటుందో తెలియదు.. ఆ తర్వాత కూడా స్కాన్ చేయించుకుని.. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత కానీ సెట్స్‌లోకి రాదని అంటున్నారు. అసలు ఆమె ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ ఇవ్వక చుక్కలు చూపిస్తోందట.
పూజ వస్తే డిసెంబర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చు. అంటే షెడ్యూల్స్ కూడా వరుసగా లేట్ కానున్నాయి. ఇప్పటికే రకరకాల కారణాలతో సినిమా లేట్ అయ్యింది అనుకుంటే.. ఇప్పుడు పూజా దెబ్బతో షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. ఏదేమైనా ఈ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంత ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తుంటే అంత ఆసల్యం అవుతోంది.