Moviesఫైనల్లీ..అనుకున్నది సాధించిన జాన్వీ కపూర్..ఆ హీరోతోనే టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్..!!

ఫైనల్లీ..అనుకున్నది సాధించిన జాన్వీ కపూర్..ఆ హీరోతోనే టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో గెస్ చేయడమే ఇబ్బందికరంగా మారిపోయింది . ఈ వార్త అబద్దం అని అనుకునేసరికి ఆ వార్తలు నిజం చేస్తూ అఫీషియల్ ప్రకటన వచ్చేస్తుంది. నిన్న మొన్నటి వరకు బుచ్చిబాబు సనా పేరుని ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో జనాలు మనకు తెలిసిందే. ఒక్క సినిమా హిట్ కొట్టాడని ..ఆ తర్వాత అడ్రస్ లేకుండా వెళ్లిపోయాడని.. సుకుమార్ పేరు చెప్పుకొని బ్రతికేస్తున్నాడని నానా విధాలుగా ఆయనపై ట్రోల్ చేశారు .

అయితే ఆ ట్రోల్స్ ని గట్టిగా ఫేస్ చేసిన బుచ్చిబాబు ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాకు అఫీషియల్ గా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు . అంతేకాదు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఎక్కించబోయే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. కాగా ఎన్టీఆర్ తో చేయాలనుకున్న స్క్రిప్టును చరణ్ తో చేయబోతున్నాడని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

అంతేకాదు ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఇద్దరు ముద్దుగుమ్మలను సెలెక్ట్ చేసుకున్నారని ..మొదట హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ..రెండో హీరోయిన్ గా తన లక్కీ బ్యూటీ కృతిశెట్టిని ఫిక్స్ చేశారని తెలుస్తుంది . నిజంగా ఇది అభిమానులకు మంచి కిక్కెక్కించే న్యూస్. రామ్ చరణ్ పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు చూడడానికి చాలా చక్కగా ఉంటారు . ఒకవేళ బుచ్చిబాబు సనా ఇదే ఫార్మేట్లో దూసుకెళ్తే మాత్రం రాబోయే రోజుల్లో మంచి మంచి ఛాన్సెస్ అందుకుంటాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . చూద్దాం మరి ఈ సినిమా బుచ్చిబాబుకి ఏ రేంజ్ హిట్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news