టాలీవుడ్ యంగ్ టైగర్ త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలు దాటుతోంది. అప్పటి నుంచి కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.. రెండు సినిమాలపై అఫీషియల్ ప్రకటనలు అయితే వచ్చేశాయి. అయితే ఇప్పటకీ ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లలేదు. కొరటాల సినిమా అయితే అదిగో పులి..ఇదిగో మేక అన్న చందంగా ప్రచారం జరుగుతోంది.. వార్తలు వస్తూ ఉన్నాయే తప్పా ఇప్పటకీ సెట్స్ మీదకు అయితే వెళ్లలేదు.
ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల చేస్తోన్న సినిమా కావడంతో కొరటాల ఎన్టీఆర్ సినిమాను ఏ విషయంలోనూ ముందుకు కదలనీయడం లేదు. చాలా అతి జాగ్రత్తలకు పోతోన్న పరిస్థితే ఉంది. అసలు హీరోయిన్ ఎవరో తేల్చకుండానే కొరటాల ఆరేడు నెలలుగా నాన్చుతూ వస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కే ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా ? ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని వెయిటింగ్‌లో ఉన్నారు.
అయితే హీరోయిన్ విషయంలో ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలించాక బాలీవుడ్ భామ జాన్వీకపూర్ పేరు ఫైనలైజ్ చేశారు. కొద్ది రోజుల క్రితమే జాన్వీ తనకు ఎన్టీఆర్‌తో నటించాలని ఉందన్న కోరిక అయితే వ్యక్తం చేసింది. తనకు ఎన్టీఆర్‌తో వర్క్ చేయాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందని కూడా చెపుతూ వస్తోంది.
కొరటాల ఆలియా భట్ తర్వాత జాన్వీతోనే చర్చలు జరిపినా ఎందుకో గాని ఆమె ఓకే చెప్పలేదు. ఇక రీసెంట్‌గా జాన్వీనే ఈ సినిమాలో హీరోయిన్ వేకెన్సీ ఉందన్న విషయం తెలుసుకుని ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి మరీ ఆఫర్ కోరిందని తెలిసింది. పైగా ఇది పాన్ ఇండియా లెవల్లో తీస్తోన్న సినిమా. అటు నార్త్ మార్కెట్ ఉండాలంటే.. హిందీ వాళ్లకు బాగా తెలిసిన హీరోయిన్ ఉండాలి.. అందుకే ఎన్టీఆర్ సిఫార్సు మేరకే జాన్వీని హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు గాను జాన్వీకి రు. 3 కోట్లు రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని అంటున్నారు. ఇది కాస్త ఎక్కువే అనుకోవాలి. పూజా, కియారా లాంటి వాళ్లే రు. 2 కోట్లకు ఓకే అంటున్నారు. అయితే జాన్వీకి తెలుగులో ఇంకా ఒక్క సినిమా కూడా చేయకుండానే.. ఎన్టీఆర్ పక్కన చేయడం.. అందులోనూ.. రు. 3 కోట్ల రెమ్యునరేషన్ అంటే నక్క తోక తొక్కిందనే అనుకోవాలి.