హాట్ బ్యూటీ సమంత గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తన పేరుకి పరిచయాలు చేయవలసిన పని లేకుండా పాపులారిటీ సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ సమంత . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన సమంత ప్రజెంట్ పాన్ ఇండియా లవెల్లో సినిమాలు చేసి హిట్లు కొడుతుంది . ఫస్ట్ టైం కెరియర్ లోనే పాన్ ఇండియా లెవెల్లో తరకెక్కిన సినిమా యశోద. నవంబర్ 11న రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఇండస్ట్రీ రికార్డును కొల్లగొట్టింది . మరీ ముఖ్యంగా విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఫుల్ లెంత్ హీరోయిన్గా నటించిన సినిమా కావడంతో జనాలు మరింత ఇంట్రెస్ట్ చూపించారు .
సమంత కూడా ఏ విషయంలోనూ తగ్గేదేలే అన్న ఫార్మేట్లో విజృంభించేసింది. అమాయకపు సర్వకేట్ మదర్ గా నటిస్తూనే ..మరోవైపు ధైర్యం గల పోలీస్ ఆఫీసర్గా రెండు షేడ్స్ లోనూ అలరించింది . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా బాధపడుతున్నాను అని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ సమంత మయోసైటిస్ థర్డ్ స్టేజ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు సమంత మయోసైటీస్ వ్యాధికి అసలైన మందు లేదట. కొత్త మందులు ట్రై చేస్తున్నారు. మిక్స్డ్ డోసేజెస్ ని వాడుతూ సమంతకు ఆ వ్యాధి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు .
అయితే సమంత మయోసైటీస్ వ్యాధికి ఇంగ్లీష్ మందులను వాడడం స్టాప్ చేసేసిందట. ఇంగ్లీష్ మందులను ఆపేసి..పూర్తిగా ఆయుర్వేదిక్ మందులను వాడడానికి ప్రయత్నిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో సమంత ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇన్నాళ్లు ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా ట్రై చేసి ఇప్పుడు సడన్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే పూర్తిగా ఆరోగ్యం దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి.. డాక్టర్ సజెషన్స్ తీసుకొని ట్రై చేస్తే మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఇంగ్లీష్ మందులు వాడుతో సడన్గా ఆపేసి ఆయుర్వేదిక్ తీసుకోవడం చాలా ప్రమాదంతో కూడిన పనులు అంటూ జనాలు బాధపదుతున్నారు. చూడాలి మరి సమంత ఏం చేస్తుందో..?