Moviesప్రభాస్, అనుష్క పెళ్లి గురించి కృష్ణంరాజు డైరీలో అలా రాశారా...?

ప్రభాస్, అనుష్క పెళ్లి గురించి కృష్ణంరాజు డైరీలో అలా రాశారా…?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ ప్రభాస్, అనుష్క గురించి వీరి మధ్య ఉన్న స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్, అనుష్క స్టార్ స్టేటస్ తో ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రభాస్ అనుష్క పలు సినిమాలలో కలిసి నటించగా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. అయితే ప్రభాస్ – అనుష్క మధ్య ఏదో ఉందని మాత్రం వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.

ప్రభాస్, అనుష్క వేర్వేరుగా పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ ఒంటరిగానే ఉండటంతో వీళ్లిద్దరి మధ్య స్నేహం కాకుండా ఏదో ఉందని కొంతమంది భావిస్తున్నారు. ఎందుకంటే వీరిద్ద‌రు కూడా 40వ వ‌డిలోకి వెళ్లిపోయారు. ఇద్ద‌రి వ‌య‌స్సులు కూడా ముదిరిపోతున్నాయి. గతంలో ప్రభాస్ అనుష్క ప్రేమించుకుంటున్నారని రాబోయే రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి.

చాలా ఇంటర్వ్యూలలో ప్రేమ, పెళ్లి గురించి ప్రభాస్, అనుష్కలకు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ప్రభాస్ అనుష్క మాత్రం తమ మధ్య ప్రేమ లేదని వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.
ప్రభాస్ అనుష్క స్పష్టత ఇచ్చినా వాళ్ల మధ్య బలమైన ప్రేమ బంధం ఉందని చాలామంది నమ్ముతున్నారు. గతంలో అనుష్క ఒక టీవీ షోలో పాల్గొన్న సమయంలో సినిమాలైనా వదులుకుంటాను కానీ ప్రభాస్ తో స్నేహాన్ని వదులుకోను అని వెల్లడించారు.

ఈ ఒక్క మాట వల్ల చాలామంది అనుష్క ప్రభాస్ ని ఇష్టపడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ప్రభాస్ అనుష్క మధ్య ఉన్న బంధం ఏంటో క్లియర్ గా తెలియలేదు. అయితే వీరి పెళ్లి గురించి ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కూడా తన డైరీలో రాశారని సమాచారం అందుతోంది. త‌న‌కు అనుష్క ప‌ట్ల మంచి అభిప్రాయం ఉంద‌ని… ఆమె మంచి విలువ‌లు క‌లిగిన అమ్మాయి అని చాలా సంద‌ర్భాల్లో ఆమె పేరును త‌న డైరీలో ప్ర‌స్తావించార‌ట‌.

ఈ మాట‌ల‌ను బ‌ట్టే కృష్ణంరాజుకు వీరిద్ద‌రి పెళ్లి ఇష్ట‌మ‌న్న ప్ర‌చారం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.
ప్రభాస్ డైరెక్ట్ గా స్పందిస్తే మాత్రమే ఈ వార్తల గురించి పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. ప్రభాస్ అనుష్క జోడీ బాగుంటుందని వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. ప్రభాస్… అనుష్క తమ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news