రెబల్‌స్టార్ కృష్ణంరాజు కొద్ది రోజుల క్రితమే మనలను వదిలి వెళ్లిపోయారు. 1980వ దశకంలో తిరుగులేని రెబల్‌స్టార్‌గా వెండితెరను ఏలేసిన ఆయన ఆ తర్వాత సీనియర్ నటుడిగా మారి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ అయ్యారు. ఇక ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ఈ రోజు నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ మీద ఏకంగా రు. 3 వేల కోట్ల బిజినెస్ జరిగే సినిమాలు నడుస్తున్నాయి.
ఇక కృష్ణంరాజు వ్యక్తిగత విషయానికి వస్తే చాలా తక్కువ మందికి మాత్రమే ఇప్పటి వరకు తెలుసు. కృష్ణంరాజు వెండితెర మీద రెబల్‌స్టార్ అయినా ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయనకు ముందుగా 1969లో సీతాదేవితో వివాహం జరిగింది. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఒక కుమార్తెను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు.
అయితే 1995లో సీతాదేవి యాక్సిడెంట్‌లో మృతి చెందడంతో కృష్ణంరాజు బాగా మనోవేదనకు గురైపోయారు. యేడాది పాటు ఒంటరిగా ఉంటూ ఎంతో కలత చెందారు. అయితే ఆయనకు ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్లు కృష్ణంరాజు మనోవేదన చూడలేక 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన సంప్రదాయ రాజుల కుటుంబానికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజుకు మళ్లీ పెళ్లి చేశారు.
అయితే వయస్సులో కృష్ణంరాజుతో పోలిస్తే శ్యామలాదేవి చాలా చిన్న అట. పెళ్లయ్యే టైంకే వీరిద్దరి మధ్య ఏకంగా 28 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని అంటారు. అయితే ఈ దంపతులకు కూడా ముగ్గురు కుమార్తెలు జన్మించారు. వీరి పేర్లు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి. ఇక కృష్ణంరాజు ఓవరాల్‌గా 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన చివరి సినిమా ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్.