నాటి తరం హీరోయిన్లలో కనురెప్పవాలకుండా చేసిన నటీమణి అంజలీదేవి. ఆవిడ నటించిన అనార్కలి.. సినిమా.. బ్రిటీష్ ప్రభుత్వంలోనూ అదే తెలుగులో వీక్షించి.. అప్పటి బ్రిటన్ రాజు అంజలికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపి.. బ్రిటన్ రాజసౌధంలో ఘన సత్కారం చేశారు. అలాంటి నటి.. అంజలీదేవికి.. సంగీత దర్శకులు ఆది నారాయణరావుకు మధ్య ప్రేమ చిగురించింది. సాధారణంగా హీరోలు.. హీరోయిన్లు ప్రేమలో పడడం సహజం. కానీ, అంజలీదేవి విషయంలో ట్రెండ్ మారింది. అప్పటి దిగ్గజ సంగతీ దర్శకుడిగా పేరొందిన ఆదినారాయణరావును ఆమే ప్రేమించిందని అంటారు.
వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లేందుకు అనేక కష్టాలు పడాల్సి వచ్చిందని.. అంజలీదేవే చెప్పుకొచ్చారు.
కన్నడ నేపథ్యం ఉన్న అంజలీదేవి కుటుంబంలో నలుగురు అక్కచెల్లెళ్లు. మగ పిల్లలు లేరు. దీంతో ఎంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య అంజలీదేవి తండ్రి ఆమెను పెంచారు. ఈ క్రమంలోనే అంజలీ దేవి పెరిగారు కూడా. అయితే.. ఆదినారాయణరావు కుటుంబంలో అంతా మగవారే. దీంతో ఇది ప్రధాన అడ్డంకి అయిపోయిందని అంజలీదేవి చెప్పేవారు.
ఎందుకంటే.. అక్కడకు పిల్లనిస్తే.. కెరీర్ దెబ్బతింటుందని అంజలీదేవి తల్లి ఆవేదన చెంది.. ఒప్పుకోలేదట. ఇక, ఆమె తండ్రి అయితే.. సినిమా ప్రేమలు.. సినిమాల వరకే ఉండాలని.. గడప దాటిలోపలికి రాకూడదని షరతు పెట్టారట. దీంతో ఒకానొక దశలో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారట అంజలీదేవి. ఈ సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావు ప్రోద్బలంతో అన్నగారు ఎన్టీఆర్ జోక్యం చేసుకున్నారు. ఆదినారాయణరావును సంప్రదించి.. విషయం తెలుసుకున్నారు.
అంజలీదేవి కుటుంబాన్ని తాను ఒప్పిస్తానని.. వారి విషయంలో సున్నితంగా వ్యవహరించాలని సూచించారట. ఇలా.. అంజలీదేవి కుటుంబం వద్దకు వెళ్లి మరీ.. వీరి ప్రేమ గురించి వివరించి.. ఆ కుటుంబాన్ని ఒప్పించారని.. ఎన్టీఆర్ ఆనాడు చెప్పకపోయినా.. జోక్యం చేసుకోకపోయినా.. తమ పెళ్లిని ఊహించేవాళ్లం కాదని అంజలీదేవి చెప్పుకొచ్చారు. ఒక్క అంజలీదేవి విషయంలోనే కాదు.. గీతాంజలి విషయంలోనూ అన్నగారు జోక్యం చేసుకుని.. వివాహం జరిపించారని అంటారు.