బుల్లితెరపై సుధీర్-రష్మి జంటకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటి సంపాదించుకున్న రష్మీ.. జబర్దస్త్ కమెడియన్ సుధీర్ కూడా అదే రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు . వీళ్లిద్దరు కలిసి చేసిన పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో జనాలను అలరిస్తాయో ప్రత్యేకించి చెప్పనవసరం లెదౌ. మరీ ముఖ్యంగా ఢీ షో లో వీళ్లు చూపించిన హై వోల్టేజ్ స్కిట్స్ చాలా బాగా జనాలు ఆకట్టుకుంటాయి.
ఈ క్రమంలోని వీళ్ళకు యూట్యూబ్ జంట అంటూ ఒక క్రేజీ ట్యాగ్ ని అటాచ్ చేశారు ఫ్యాన్స్. కెవలం బుల్లితెర పైనే కాదు..బ్వెండి తెర పై కూడా వచ్చిన అవకాశాలతో లక్ ని పరీక్షించుకుంటున్న ఈ జంట ..త్వరలోనే కలిసి హీరో హీరోయిన్లుగా ఓ సినిమా చేయబోతున్నారు. దీనిపై సుధీర్ తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మనకు తెలిసిందే సుధీర్ హీరోగా నటించిన “గాలోడు” సినిమా రిలీజ్ అవుతుంది .
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ తన పర్సనల్ విషయాలు కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కాగా ఇదే క్రమంలో..” నాకు రష్మీకి మధ్య ఏమి లేదు కానీ మా మధ్యలో ఏదో ఉందంటూ క్రియేట్ చేస్తున్నారు. రేపటి రోజు రష్మీకి పెళ్లయితే నా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తల్చుకుంటుంటే భయమేస్తుంది ..నేను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు . దీంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోయేది లేదు అంటూ కొందరు ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఖచ్చితంగా సుధీర్ ని కాకుండా రష్మి వేరేవాళ్లని పెళ్లి చేసుకుంటే ఊరుకునేది లేదు అంటూ కొందరు ఫాన్స్ మండిపడుతున్నారు . చూడాలి ఈ వయ్యారం ఎక్కడదాకా వెళ్తుందో ..?