మలయాళం కుటుంబంలో జన్మించిన హీరోయిన్ రేవతి అసలు పేరు ఆశా కేలుని నాయర్. ఈమె కేరళలోని పాల్లక్కడ్ ప్రాంతానికి చెందింది. రేవతి తండ్రి ఆర్మీ ఆఫీసర్ కాగా, ఆమె చిన్నతనం నుంచే నాట్యం నేర్చుకుంది. తన ఏడేళ్ల వయసు నుంచే భారత నాట్యం నేర్చుకున్న రేవతి చెన్నైలో 1979 లో అరంగేట్రం కూడా చేసింది. రేవతి 1983లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్కూల్ లో చదువుకుంటున్న రోజుల్లో ఒక ర్యాంప్ వాక్ లో పాల్గొన్న రేవతి ఫోటోలు అప్పట్లో తమిళ మ్యాగజిన్ ముఖ చిత్రంపై రావడం తో అవి దర్శకుడు భారతి రాజా గారిని బాగా ఆకర్షించించాయి. అదే సమయంలో భారతి రాజా తన తీయబోయే చిత్రం మన్ వాసనై కోసం ఫ్రెష్ లుక్ ఉన్న హీరోయిన్ వేటలో ఉన్నాడు.
ఆలా రేవతి తమిళంలో భారతి రాజా సినిమాలో మొదటగా నటించింది. ఇక ఆ తర్వాత మలయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మానస వీణ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సౌత్ ఇండియాలోనే కాకూండా హిందీలో కూడా పాపులర్ నటిగా ఎదగడం విశేషం. ఇక నార్త్, సౌత్ అనే తేడా లేకుండ బిజీ ఆర్టిస్ట్ అయినా రేవతి తమిళం లోనే ఎక్కువగా నటించడం విశేషం. ఇక రేవతి కేవలం హీరోయిన్ గా లేదంటే గ్లామర్ డాల్ గా ఉండటం ఇష్టం లేదు.
ఆమె సినిమాకు సంబంధించి అన్ని విభాగాల్లో నైపుణ్యం సాధించి దర్శకురాలిగా కూడా మారింది. ఇక వేరు వేరు విభాగాల్లో నేషనల్ అవార్డు, ఫీల్ ఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఆమె సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ మళయాళ దర్శకుడు సురేష్ చంద్ర మీనన్ తో ప్రేమలో పడింది. పుతియా ముఖమ్ అనే చిత్రంలో సురేష్ – రేవతి కలిసి నటించారు. ఆ చిత్రానికి అతడే దర్శకుడు. 1986లో వీరి పెళ్లి జరగగా రేవతి ఆ తర్వాత కూడా సినిమాలు చేసింది. అయితే రేవతి సినిమాల్లో నటించాలనే ఉద్దేశం తో సురేష్ మొదట్లో పిల్లలను కనకూడదు అన్న కండీషన్ పెట్టాడు.
రేవతి కెరీర్ ముగిసాక పిల్లలు కావాలని అనుకున్న వారికి సంతానం కలగలేదు. ఈ విషయంలో ఇద్దరికీ బేదాభిప్రాయాలు రావడంతో 2002లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పదేళ్ల తర్వాత 2013 లో విడాకులు తీసుకొని విడిపోయారు. రేవతి మాత్రం సినిమా ఇండస్ట్రీలో రాటు దేలింది. అలాగే తల్లి కావాలని కూడా నిర్ణయించుకుంది. రేవతి తన 48 వ పుట్టిన రోజు నాడు తాను ఒక బిడ్డకు తల్లి అయ్యాను అంటూ ప్రకటించి సంచలనంగా మారింది. అయితే అందరు ఆమె ఈ వయసులో మరో పెళ్లి చేసుకోకుండా, మొదటి భర్తకు విడాకులు ఇచ్చి ఎలా తల్లి అయ్యింది అనే అనుమానం వ్యక్తం చేసారు.
అందరు నటి శోభన లాగ ఒక పాపను దత్తత తీసుకుంది అని అనుకున్నారు. కానీ కొన్ని రోజులకు రేవతి తన కూతురికి తాను బయోలాజికల్ మదర్ అంటూ ప్రకటించింది. దాంతో అంత ఆశ్చర్య పోయారు. ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనే మాట ఎక్కువగా వినిపించింది. అయితే రేవతి IVF పెద్దతో స్పెర్మ్ డోనర్ తో బిడ్డకు జన్మ ఇచ్చినట్టుగా తర్వాత తెలిసి అందరు నోరెళ్లబెట్టారు.. తల్లి కావాలన్న రేవతి ఆశయం ముందు ఆమె తండ్రి ఎవరు అన్న ప్రశ్న చిన్నబోయింది. అలా రేవతి మహి అనే బిడ్డకు తల్లిగా మారింది.