Moviesహన్సిక పెళ్లి డేట్ వచ్చేసిందోచ్..ఆ స్పెషల్ డే రోజునే.. సో లక్కి..!!

హన్సిక పెళ్లి డేట్ వచ్చేసిందోచ్..ఆ స్పెషల్ డే రోజునే.. సో లక్కి..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. తాజాగా అదే లిస్టు లోకి యాడ్ అయిపోయింది హన్సిక . కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం హన్సిక మోత్వాన్ని త్వరలోనే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందట. అంతే కాదు దీనికి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ చేసేసి ..కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉందట.

దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన హన్సిక ..ఆ తర్వాత బిగ్ ప్రొజెక్ట్స్ లో భాగమై బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది . ఈ క్రమంలోనే కోలీవుడ్ లో అవకాశాలు రావడం తో టాలీవుడ్ ను వదిలేసింది. అటువైపుగా అడుగులు వేసి టాలీవుడ్ ని మర్చిపోయింది . కాగా రీసెంట్గా హన్సిక పెళ్లికి సంబంధించిన న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ భామ డిసెంబర్ 4న రాజస్థాన్లోని కోటలో గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతుంది. దీనికి సంబంధించిన పనులన్నీ ప్రారంభించేసింది .

అంతేకాదు రెండో తేదీ నైట్ వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఫంక్షన్ చేసి.. ఆ తర్వాత పక్క రోజు సంగీత్ , మెహందీ పెట్టుకుని.. డిసెంబర్ 4న ప్రియుడుతో మెడలో తాళి కట్టించుకోబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది . రాజస్థాన్ జైపూర్ లోని ముందోటకోటలో హన్సిక వివాహం గ్రాండ్గా జరుగుతుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు మారుమ్రోగిపోతున్నాయి. అంతేకాదు హన్సిక పెళ్లికి సంబంధించిన నగలు ప్రత్యేక శ్రద్ధతో చేయించుకుంటుందట. ఇంత జరుగుతున్న హన్సిక పెళ్లి పై మాత్రం నోరు విప్పట్లేదు. చూద్దాం తాళి కట్టినాకైనా హన్సిక నోరు విప్పుతుందో లేదో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news