ఇప్పుడు హైదరాబాద్‌లో అంతా మల్టీఫ్లెక్స్ కల్చర్ బాగా ఎక్కువైంది. ఎక్కడ చూసినా ఇబ్బడి ముబ్బడిగా మల్టీఫ్లెక్స్‌లు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు నగరంలో ఏ మూల చూసినా సింగిల్ స్క్రీన్లు, పెద్ద థియేటర్లే ఎక్కువుగా కనిపించేవి. అయితే ఇప్పుడు సింగిల్ స్క్రీన్లను కూడా మల్టీఫ్లెక్స్‌లుగా మార్చేస్తున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇప్పుడు వెలవెలబోతోంది. ఇక ఇనార్బిట్ మాట్, ఏఎంబీ మాల్, సుజనా మాల్, పీవీఆర్ గ్రూప్స్, సినీ ప్లానెట్, సినీ మ్యాక్స్, బిగ్‌బజార్ వీటన్నింటి కంటే ముందు వచ్చిన ప్రసాద్ మల్టీఫ్లెక్స్ ఇలా చాలా మల్టీఫ్లెక్స్‌లు రాగా ఇప్పుడు మరి కొన్ని కన్‌స్ట్రక్షన్లో ఉన్నాయి.
అయితే ఎన్ని థియేటర్లు, ఎన్ని స్క్రీన్లు ఉన్నా కూడా హైదరాబాద్ సినీ లవర్స్‌కు అతి పెద్ద స్క్రీన్ లేదన్న బాధ అయితే ఉండేది. ఏపీలో నెల్లూరు దగ్గర సూళ్లూరుపేటలో ప్రభాస్ – యూవీ క్రియేషన్స్ వాళ్లు వీ సెల్యూలాయిడ్ స్క్రీన్ పెట్టాక అతి ఇండియాలోనే అతి పెద్ద స్క్రీన్ అయ్యింది. అంత పెద్ద స్క్రీన్ మన హైదరాబాద్‌లో లేకపోవడంతో చాలా మంది ఫీల్ అవుతున్నారు.
అయితే ఇప్పుడు హైదరాబాద్ సినీ లవర్స్‌కు ఆ కొరత తీరిపోనుంది.. ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో ఉన్న లార్జ్ స్క్రీన్‌ని ఇప్పుడు రీ మోలింగ్ చేశారు. దీంతో ఇప్పుడు ఇండియాలోనే అతి పెద్ద స్క్రీన్‌గా మారింది. ఈ స్క్రీన్ 64 అడుగుల ఎత్తు 101.6 అడుగుల వైశాల్యంతో ఉంది. దీంతో ఇప్పుడు ఇండియాలోనే అతి భారీ స్క్రీన్‌గాను, ప్రపంచంలోనే పొడవైన వెండితెర గాను రికార్డులకు ఎక్కేసింది.
ఇప్పుడు ఈ స్క్రీన్ కోసం ఒరిజినల్ ఐ మ్యాక్స్ టెక్నాలజీ వాడకపోయినా దానిని తలదన్నే రీతిలో కెనడా నుంచి వరల్డ్ క్లాస్ త్రీడీ ప్రొజెక్టర్ తెప్పించారు. ఈ స్క్రీన్‌లో మామూలు తెలుగు సినిమాలు అంత అనుభూతి ఇవ్వకపోయినా.. అవతార్ 2, బ్యాక్ టు ది వాటర్ లాంటి సినిమాలు చూస్తుంటే ఖచ్చితంగా మనం మరో ప్రపంచంలోకి వెళ్లినట్టే అవుతుంది. ఇందులో హాలీవుడ్ సినిమాలతో పాటు త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు మంచి అనుభూతి ఇస్తాయి. ఏదేమైనా హైదరాబాద్ వాసులకు ఇప్పుడు ఈ లార్జ్ స్క్రీన్‌పై సినిమాలు చూస్తూ సరికొత్తగా ఎంజాయ్ చేసే అదృష్టం కలుగుతోంది.