Moviesఫ్యీజులు ఎగిరే ఆప్డేట్: బాలకృష్ణతో యంగ్‌ డైరెక్టర్ సైకలాజికల్ డ్రామా..!

ఫ్యీజులు ఎగిరే ఆప్డేట్: బాలకృష్ణతో యంగ్‌ డైరెక్టర్ సైకలాజికల్ డ్రామా..!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అటు వెండి తెరతో పాటు ఇటు బుల్లితెరను కూడా షేక్ చేస్తున్నారు. మ‌లినేని గోపీచంద్ దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా చేస్తున్న బాలయ్య వచ్చే సంక్రాంతికి థియేటర్లలో దిగుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల‌ బాలయ్యకు కూతురుగా నటిస్తోంది. అలాగే బాలయ్య 55 ఏళ్ల వయసు మళ్ళిన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్యతో చేయ్య‌డానికి చాలామంది క్రేజీ దర్శకులు లైన్లో ఉన్నారు. పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను పేర్లు ఇప్పటికే తెరమీదకు వచ్చాయి. ఇక రీసెంట్‌గా అల్లు శీరిష్‌ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో పరశురామ్‌ సైతం బాలయ్యతో సినిమాపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా మహేష్ బాబుతో సర్కారు వారి పాట లాంటి కమర్షియల్ హిట్ సినిమా తెరకెక్కించిన పరశురామ్‌ బాలయ్యతో సినిమా చేసేందుకు తన ఆసక్తిని వ్యక్తం చేశాడు.

ఇప్పుడు బాలయ్య లైన‌ప్‌లో మరో క్రేజీ డైరెక్టర్ కూడా వచ్చి చేరిపోయాడు. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి వైవిధ్య‌మైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వెంకటేష్ మహా బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్‌ కూడా ఉంది. అల్లు శిరీష్ ఊర్వశి రాక్షసివో సినిమా ప్రి రిలీజ్ వేడుకకు బాలయ్య ముఖ్యఅతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వేడుకకు వెంకటేష్ మహా కూడా వచ్చారు.

వేదికపై మాట్లాడుతూ వెంకటేష్ బాలకృష్ణ గారితో తనకు సినిమా చేయాలని ఉందని అన్నారు. దీంతో వెంటనే బాలయ్య -వెంకటేష్ కాంబినేషన్లో సినిమా వస్తుందన్న వార్తలు వచ్చేసాయి. దీనిపై వెంకటేష్ స్పందిస్తూ బాలయ్యకు తాను ఇంకా కథ చెప్పలేదని ఒకవేళ ఆయన నుంచి ఫోన్ వస్తే కథ చెప్పేందుకు రెడీగా ఉన్నానని కూడా తెలిపారు. తన దగ్గర మంచి ఐడియాస్ ఉన్నాయని.. స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ తన వద్ద ఉందని.. బాలకృష్ణ గారికి ఆ కథ అయితే చాలా అద్భుతంగా సెట్ అవుతుందన్నాడు.

ఈ కథ ఓ సైకలాజికల్ డ్రామా. ఇందులో డార్క్ కామెడీ ఉంటుందని బాలయ్య క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని వెంకటేష్ మహా తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అంశాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో తాను రాసుకున్నానని.. ఇది చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని కూడా వెంకటేష్ మ‌హా తెలిపాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news