Moviesఆ వెటకారాలు తగ్గించుకో.. అందరి ముందే అంత మాట ఛీ ఛీ..పేరెంట్స్...

ఆ వెటకారాలు తగ్గించుకో.. అందరి ముందే అంత మాట ఛీ ఛీ..పేరెంట్స్ కే మండించిన శ్రీ సత్య ఓవర్ యాక్షన్..?

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. బిగ్ బాస్ లోకి ఇంటి సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు కుటుంబానికి దూరంగా ఉన్న కంటెస్టెంట్స్ తమ కుటుంబ సభ్యులను చూసి ఎమోషనల్ అవుతున్నారు. కాగా బిగ్ బాస్ 6 తెలుగు 12వ వారాన్ని మరింత ఆద్యంతం ఎమోషనల్ గా మార్చేశాడు బిగ్ బాస్ . చాలా రోజుల తర్వాత వారిని చూడడంతో కంటెస్టెంట్లు .. ఫ్యామిలీ మెంబర్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా ఎమోషనల్ గా మారిపోయారు .

ప్రతిసారి లాగే బిగ్ బాస్ మొదట కంటెస్టెంట్లతో కాసేపు ఆడుకొని ఫ్రీజ్ -ఫార్వర్డ్ -రివైండ్స్ లు చేయిస్తూ కామెడీని పండించారు. కాగా ఈ గేమ్ లో ఇంటి సభ్యులు చేసే పనులు చాలా సరదాగా అనిపిచ్చాయి ..నవ్వులు పూయించాయి. బుధవారం ఎపిసోడ్లో ఫస్ట్ గా ఫైమా తల్లి హౌస్ లోకి వచ్చింది. ఫైమ తల్లి కూడా చాలా జోవియల్ గా సరదాగా మాట్లాడుతూ కాసేపు హౌస్ లో కామెడీ వాతావరణం ని క్రియేట్ చేసింది. ఫైమ సంపాదించి పెడితేనే మేము తింటున్నామంటూ చెప్పి గర్వంగా ఫీల్ అయింది.

 

ఇక ఆ తరువాత హౌస్ లోకి శ్రీసత్య అమ్మా నాన్న వచ్చారు . శ్రీ సత్య అమ్మకి ఆరోగ్యం బాగాలేదు ..పక్షవాతంతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే వీల్ చైర్ లో వాళ్ళ నాన్న ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చాడు . దీంతో అమ్మను చూసిన శ్రీ సత్య ఎమోషనల్ గా మారింది కన్నీరు పెట్టుకుంటుంది.. వాళ్లు శ్రీ సత్య ని చూసి కన్నీరు పెట్టుకుంటారు. కాగా ఈ క్రమంలోని శ్రీ సత్య ఫాదర్ మదర్ శ్రీ సత్య కు మార్నింగ్ ఇచ్చారు.” హౌస్ లో గేమ్ బాగా ఆడుతున్నావు ..కానీ మొదట్లో గేమ్ చాలా బాగా ఆడేదానివి,, ఇప్పుడు నీకు కాన్సన్ట్రేషన్ తప్పుతుంది ..వెటకారాలు ఎక్కువయ్యాయి.. నడుము తిప్పడాలు మరింత ఎక్కువయ్యాయి ..వాటిని తగ్గించుకోవాలని పరోక్షంగా కామెంట్ చేశాడు” ఆమె తండ్రి . దీంతో అందరి ముందే అలాంటి మాట మాట్లాడేసరికి ఆమె ముఖం వాడిపోయింది. అంతేకాదు ఆమె చేసింది నిజమే అంటూ తల్లిదండ్రులు చెప్పిన సజెషన్ కరెక్టే అంటున్నారు జనాలు . హౌస్ లోకి వచ్చిన కొత్తలో శ్రీ సత్య వేరు ఎపిసోడ్స్ జరిగే కొద్ది శ్రీ సత్య వేరు.. ఇకనైనా ఆమె రూట్ మార్చుకుంటే టాప్ ఫైవ్ లో ఉంటుంది . లేదంటే ఈ వారమే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు . మరి చూడాలి శ్రీ సత్య కి వాళ్ళ అమ్మానాన్న మాటలు ఏమైనా బుర్రకెక్కుతాయో ఎంతవరకు ఫాలో అవుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news