స్టార్ హీరోలందరూ వారి నట వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. వారిని అడ్డుపెట్టుకొని చాలామంది ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమవుతున్నారు. అయితే, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు మాత్రం దాదాపు సక్సెస్ అవుతున్నారు. కానీ, కొందరు మాత్రం అడ్రస్ లేకుండా వెనుతిరుగుతున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగానో, హీరోయిన్‌గానో.. దర్శకుడిగానో కొనసాగుతున్నప్పటికీ వారి పేరు వాడుకోకుండా తమకి వచ్చిన అవకాశాలను చాలనుకుంటున్న వారూ ఉన్నారు.
అలాంటి వారిలో ప్రియమణి ఒకరు. అలా వాడుకోని హీరోయిన్ బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్. ప్రియమణి తమిళంలో నటించిన మొదటి సినిమా పరుత్తివీరన్. ఈ సినిమాలో తన సహజమైన నటతో నేషనల్ అవరాడ్‌ను దక్కించుకుంది. మొదటి సినిమా అంటే చాలామంది గ్లామర్ రోల్ చేసి కమర్షియల్ హీరోయిన్‌గా స్థిరాడాలనుకుంటారు. కానీ, ప్రియమణి ఛాలెంజింగ్ రోల్ ద్వారా తనలోని నటిని బయటకి తీసి జాతీయ స్థాయిలో అవార్డ్ దక్కించుకుంది.
ఈ సినిమాతో ఒక్కసారిగా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ…ఇంకా చెప్పాలంటే మొత్తం సౌత్‌లోనే టాలెంటెడ్ హీరోయిన్‌గా పాపులారిటీని తెచ్చుకుంది. దాంతో తెలుగు, తమిళం భాషలలో వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది. తెలుగులో ప్రియమణి చేసిన కొన్ని గ్లామర్ పాత్రలు హాట్ టాపిక్ అయ్యాయి కూడా. ముఖ్యంగా నితిన్ సరసన నటించిన ద్రోణ సినిమాలో ప్రియమణి వేసిన బికినీ సూట్ సంచలనం అయింది.
ఇక ముస్తఫా రాజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గాయి. కాస్త గ్యాప్ తర్వాత నారప్ప, విరాటపర్వం సినిమాలలో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. అలాగే హిందీలో సూపర్ హిట్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్ సీజన్‌లో నటించి బాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. ఇంత పేరు తెచ్చుకున్నప్పటికీ తన కజిన్ అయిన విద్యాబాలన్ సపోర్ట్ మాత్రం తీసుకోలేదు ప్రియమణి. నిజంగా అలా తీసుకొని ఉంటే సౌత్ కంటే కూడా బాలీవుడ్‌లోనే అగ్ర కథానాయికగా కొనసాగేది. ఈ విషయంలో ప్రియమణిని మెచ్చుకొని తీరాల్సిందే.