Moviesనమ్రత అంటే ఇష్టం లేకపోయినా.. ఆమె కోసం అలాంటి పని చేసిన...

నమ్రత అంటే ఇష్టం లేకపోయినా.. ఆమె కోసం అలాంటి పని చేసిన కృష్ణ..కన్నీరు పెట్టుకున్న కోడలు..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ నిన్న తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు మరణించిన విషయం తెలిసిందే. కృష్ణ నిన్న కాంటినెంటల్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఘట్టమనేని ఫ్యాన్స్ ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. అంతే కాదు టాలీవుడ్ సీనియర్ హీరోస్, స్టార్స్, రాజకీయ ప్రముఖులు అందరు కృష్ణ కడసారి చూపు కోసం ఆయన ఇంటికి తరలివస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని సందర్శిస్తున్నారు . ఆయన అభిమానులు ఇలాంటి టైంలోనే కృష్ణకు సంబంధించిన పాత ఇంటర్వ్యూలు ,పాత వీడియోల ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ తన కోడలు నమ్రతతో ప్రవర్తించిన తీరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ నమ్రతను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి వంశీ సినిమా చేస్తున్న టైంలోని వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది . ఇక ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లి ఇంట్లో చెప్పి బిగ్ షాక్ ఇచ్చింది . అయితే మహేష్ తో పెళ్లికి నమ్రత ఇంట్లో వాళ్ళు మొదట ఒప్పుకోలేదు ..అలాగే నమ్రత తో పెళ్లి కి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒప్పుకోలేదు. అయితే ఎలాగోలా మాయ చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు ఈ లవ్ బార్డ్స్. అయితే మొదట పెళ్లి కి నో చెప్పిన కృష్ణ .. ఆ తర్వాత నమ్రతతో తన ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేశారట .

అంతేకాదు హీరోయిన్ అయి ఉండి తన కొడుకు కోసం తన ఇష్టమైన కెరియర్ ను వదులుకున్న నమ్రత అంటే కృష్ణకు చాలా ఇష్టమట. చాలామంది ప్రముఖులతో కూడా నా కోడలు బంగారం ..చక్కగా ఇంటి బాధ్యతలను నెరవేరుస్తుంది అంటూ చెప్పుకొస్తారట . అంతేకాదు కూతుర్లకి కూడా చెప్పుకోలేని విషయాలను మన్రతతో చెప్పుకొని కృష్ణ మనసులోని బాధ దించుకునే వారట . ఏ కోడలైతే కోరుకుంటుందో అలాంటి మాట కృష్ణ చెప్పి నమ్రతను ఎమోషనల్ గా కనెక్ట్ చేశారు.

నువ్వు నా కోడలు కాదు కూతురివి అంటూ.. మొదట నీతో పెళ్లి వద్దన్నందుకు క్షమించమని .. ఇలాంటి భార్యని మహేష్ బాబుకు తీసుకురాలేను,, నువ్వు మహేష్ ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా పిల్లలతో ఉండండి అంటూ పుట్టిన రోజు నాడు ఆమెను ఆశీర్వదించాడట. ఆ రోజు నమ్రత లైఫ్ లో ఎప్పటికి మర్చిపోలేను అంటూ ఫ్రెండ్స్ తో చెప్పుకొచ్చిందట. ఏది ఏమైనా సరే మామ లాంటి తండ్రిని కోల్పోయి తీవ్ర శోక సంద్రంలో ఉంది. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా మారాడు మహేష్ బాబు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news