టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “ముకుంద” సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..ఆ తర్వాత ఒక్క హిట్ కోసం చాలా ఏళ్లు ట్రై చేసింది . బాలీవుడ్ లోనూ తన లక్ ని పరీక్షించుకుంది. అయితే అమ్మడికి హిట్ ఇచ్చింది మాత్రం ఎన్టీఆర్ అని చెప్పాలి. అరవింద వీరరాఘవ సమేత అనే సినిమాతో పూజా హెగ్డే మొదటి హిట్ అందుకునింది .
ఇక ఆ తరువాత వరుస హిట్ల తో దూసుకుపోయింది. మళ్లీ పూజా ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేయించుకుంది. దానికి కారణం బాక్స్ ఆఫీస్ వద్ద ఆమె నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ గా నిలవడమే . కాగా ప్రజెంట్ పూజా హెగ్డే తన ఆశలన్నీ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పైన పెట్టుకుంది. అయితే ఈ సినిమా ఏ ముహూర్తానా మొదలు పెట్టారో కానీ అప్పటినుంచి సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్లకి అస్సలు టైం కలిసి రావడం లేదు. నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలు టైంలో మహేష్ బాబు కోవిడ్ కి అటాక్ అయి పూజా కార్యక్రమాలకు కూడా అటెండ్ అవ్వలేదు.
ఇక ఆ తర్వాత పూజా హెగ్డే కాలికి గాయం అయింది . ఇక ఆ తర్వాత మహేష్ బాబు అమ్మగారు మరణించారు . ఇప్పుడు మహేష్ బాబు నాన్నగారు మరణించారు . అంతేకాదు సినిమా షూట్ ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ సినీ ఇండస్ట్రీలో కొన్ని కారణాల కారణంగా షూటింగ్ ఆపేశారు . ఇలా వరుసగా ఒకదానిమీద ఒకటి దెబ్బ పడుతూ సినిమా ఇప్పటివరకు ఒక్క షెడ్యూల్ ని మాత్రమే కంప్లీట్ చేసుకుంది . పూజ హెగ్డే కాళ్ళకి గాయమైన కారణంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఆ గాయం తిరగబడినట్లు డాక్టర్ చెప్పారట . పూజ కాళ్ల గాయం ఇంకా నయం అవలేదని మరో మూడు నెలలు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని.. ఈ టైంలో పూజ హెగ్డే ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన కాళ్ల గాయం మరింత ఎక్కువవుతుందని.. అంతేకాదు మరింత నిర్లక్ష్యం చేస్తే వీల్ చైర్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారట. అంతేకాదు పూజా హెగ్డే ఈ మూడు నెలల తర్వాత కూడా తన కాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు . బరువైన ఇబ్బంది పెట్టే స్టెప్స్ వేయకూడదు. అంటే ఇక పూజ డాన్స్ చేయడానికి పనికి రాదా ..?సింపుల్ స్టెప్స్ కి పరిమితం అవ్వాలా ..?ఏంటి డాక్టర్స్ కొంచెం ట్రై చేయండి.. పూజ కాళ్ల గాయం నయం చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!