Moviesజయసుధ మొదటి భర్త ఎవ‌రో తెలుసా... ఎందుకు విడాకులు ఇచ్చేసిందంటే...!

జయసుధ మొదటి భర్త ఎవ‌రో తెలుసా… ఎందుకు విడాకులు ఇచ్చేసిందంటే…!

స‌హ‌జ‌న‌టి జయసుధ అసలు పేరు సుజాత. తెలుగులో 300 లకు పైగా సినిమాల్లో నటించింది. మద్రాసు లో పుట్టి పెరిగిన జయసుధ తన ఆంటీ విజయ నిర్మలను ఆదర్శంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఆమె నటించిన మొదటి సినిమా పండంటి కాపురం. ఇది 1972 లో విడుదల కాగా, ఇందులో ఒక చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత సోగ్గాడు సినిమాతో శోభన్ బాబు సరసన మెయిన్ లీడ్ రోల్లో నటించిన జయసుధ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ – హిందీ భాష‌ల్లో దాదాపు 400 ల సినిమాల్లో నటించింది. అప్పటి టాప్ తెలుగు హీరోయిన్ల‌లో జయసుధ ఒకరిగా ఉండేది.

అప్పటి అగ్ర హీరోలందరితో అందరితో కలిసి నటించిన జయసుధ, తన కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఒక వ్య‌క్తితో ప్రేమలో పడింది. ఆ ప్రేమ ఆ తరువాత ఆమెకు పలు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చాల మంది జయసుధ భర్త కేవలం నితిన్ కపూర్ అనే అనుకుంటారు. కానీ నితిన్ కపూర్ తో పెళ్ళి కంటే ముందు మరో వ్యక్తి తో ఆమెకు పెళ్ళి అయింది. నితిన్ కపూర్ మరణించిన సమయంలో వడ్డే నవీన్ తండ్రి. ప్రముఖ నిర్మాత అయినా వడ్డే రమేష్ జయసుధ మొదటి భర్త అని, వడ్డే నవీన్ ఆమెకు కొడుకు అవుతాడంటూ పలు రూమర్స్ పుట్టుకచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. జయసుధ మొదటి భర్త పేరు కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్.

ఓ సినిమా షూటింగ్ టైంలో ఆమెకు రాజేంద్ర ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే ఈ పరిచయం ప్రేమగా మారింది. కానీ జయసుధ కుటుంబ సభ్యులు వారి పెళ్ళికి అంగీకరించక పోవడంతో రహస్యంగా గుడిలో పెళ్ళి చేసుకున్నారు. ఇక ఆమె కుటుంబ సభ్యులు చేసేది ఏమీ లేక విజయవాడ లోని మొఘల్రాజ‌పురం మధు కళ్యాణ మండపంలో పెళ్ళి చేశారు. వారి పెళ్ళి కి రామ నాయుడు అప్పటి జడ్జ్ నాదెండ్ల శ్రీనివాస్, వి.పి రామచంద్ర ప్రసాద్, మురళి మోహన్ వంటి పలువులు ప్రముఖులు వచ్చి వారిని ఆశీర్వదించారు.

వీరి పెళ్ళి గురించి అప్పట్లో వార్త పత్రికల్లో మెయిన్ హెడ్ లైన్స్ లో వచ్చింది. పెళ్ళి లో ఆమెను చూడడానికి వందలమంది అభిమానులు తరలి వచ్చారు. ఎంత తొందరగా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారో అంతే తొందరగా వీరి పెళ్లి కూడా పెటాకులు అయ్యింది. అయితే రాజేంద్ర ప్రసాద్ ఒక వ్యాపార వేత్త, జయసుధ మాత్రం ఒక హీరోయిన్. పెళ్లి అయినా తర్వాత కూడా జయసుధ నటనలో కొనసాగింది. అయితే పెళ్లయ్యాక కొన్ని రోజులకే రాజేంద్ర ప్రసాద్ పెట్టె టార్చర్ భరించలేక ఆమె చెన్నైలోని విజయ వాహిని స్టూడియో కి వెళ్లి అక్కడే కొన్ని రోజులు తలదాచుకుంది. అక్కడ ఆ స్టూడియో అధినేత నాగిరెడ్డికి జరిగింది చెప్పి కన్నీరు పెట్టుకుంది.

వెంటనే దాసరి నారాయణరావుతో సహా పలువురు ప్రముఖులను పిలిచి త‌న‌కు జరిగిన అన్యాయం గురించి పూర్తిగా వివరించింది జయసుధ. కానీ రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వెళ్లి అందరి ముందు మంచి వాడిలా నటిస్తూ ఎంత బ్రతిమిలాడినా.. ఆమె అతడితో కాపురం చేయడానికి వెళ్ళాను అని చెప్పింది. తర్వాత కొద్ది రోజులు జయసుధ విజయ వాహిని స్టూడియో లోనే ఉంది. ఆలా వాళ్లిద్దరూ విడిపోయారు. ఇక కొన్నాళ్ళకు మళ్ళీ సినిమాలో నటించడం మొదలు పెట్టింది. ఆ సమయంలో నితిన్ కపూర్ తో పరిచయం ఏర్పడటం, మళ్లి ప్రేమ చిగురించడం, పెళ్లి కావడం చకా చకా జరిగిపోయాయి. ఆ త‌ర్వాత నితిన్‌తో ఆమెకు విబేధాలు రావ‌డంతో అత‌డు ముంబైలో ఉంటే ఆమె హైద‌రాబాద్‌లో ఉండేది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news