ప్రతి వ్యక్తికి ఎక్కడో ఒక చోట వీక్ నెస్ అనేది ఉంటుంది. అది ఏ విషయంలో అయినా కావొచ్చు. ఇలానే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్నగారు ఎన్టీఆర్‌కు కూడా ఒక వీక్ నెస్ ఉంది. అయితే.. అదే ఆయనకు చాలా మందిని దూరం చేసిందని అంటారు. అన్నగారు అనేక సినిమాల్లో నటించారు. పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఇలే ఏ అవకాశం వచ్చినా ఆయన వదులుకోలేదు. అయితే.. ఈ క్రమంలో అన్నగారు… రెమ్యునరేషన్ విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు.
కొన్ని కొన్ని సినిమాలు పెద్దగా ఆడేవి కావు. వాస్తవానికి అన్నగారు నటించిన ఏ సినిమా అయినా.. 100 రోజులు ఖచ్చితం అనే టాక్ ఉండేది. అయినా.. కూడా కొన్ని కొన్ని ఆడలేదు. ఈ విషయాన్ని అన్నగారు కూడా ఒప్పుకున్నారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు.. ప్రముఖ నటులు.. ఎస్వీ రంగారావు.. చిత్తూరు వీ నాగయ్య వంటివారు.. తాము తీసుకున్న రెమ్యున రేషన్‌లో సగం మొత్తాన్ని నిర్మాతలకు లేదా నిర్మాణ సంస్థలకు తిరిగి ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి.
అసలు ఈ సంస్కృతిని తీసుకువచ్చింది నాగయ్యగారే అంటారు. ఇప్పుడు కొందరు ఇలానే తిరిగి ఇచ్చేస్తున్నారు కదా! అప్పట్లోనూ ఈ విధానం అమలు చేసేవారు. అయితే, అప్పుడు.. ఇప్పుడు కూడా ఇది ఎవరికీ నిర్బంధం అయితే కాదు. స్వచ్ఛందంగానే తిరిగి ఇచ్చేవారు. ఇలా.. నాగయ్య అనేక సినిమాలకు తిరిగి ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలానే కొన్ని కొన్ని సినిమాలు ఫెయిలై.. ఆశించినంత ఆడగకపోయినప్పుడు.. ఎస్వీ రంగారావు విలన్ పాత్రే పోషించినా, ఆయన కూడా ఇచ్చేసేవారట.
ఎందుకంటే, నిర్మాత బాగుంటే తర్వాత మరో సినిమాతీస్తారు.. అనే కాన్సెప్టుతో! ఇలానే ఎన్టీఆర్‌ను కూడా.. ఇవ్వమని ఒక నిర్మాత అడిగారు. అయితే, ఎన్టీఆర్ మాత్రం జయాపజయాలతో మాకు సంబంధం లేదు. అని నిష్కర్షగానే చెప్పేసేవారట. సినిమా కథ మీకు నచ్చిన తర్వాతే మా వద్దకు తీసుకు రండి… మేం మా పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తాం అని చెప్పడంతో పాటు తన రెమ్యునరేషన్ విషయంలో కూడా నిక్కచ్చిగానే ఉండేవారట.
అందుకే కొందరు ఆయనపై డబ్బు పిచ్చి ముద్ర వేశారు. ఇలా చాలా రోజులు తమిళ పరిశ్రమంలోనూ నడిచింది. దీంతో అన్నగారితో సినిమాలు తీసేవారు.. అన్నింటికీ సిద్ధమై తీయాలనే పేరు వచ్చింది. దీనిపై అన్నగారు కూడా.. ఒక సందర్భంలో మాట్లాడుతూ.. వారికి ఉన్నట్టుగానే తమకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని.. నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఆదుకోవాలో మాకు తెలుసు.. దాని గురించి బయట ప్రస్తావన అక్కర్లేదని చెప్పేవారట.
ఇలా చేసిన సాయాలు బయటకు చెప్పుకునే అలవాటు లేదు. అందుకే ఆయనపై డబ్బు పిచ్చి ముద్ర పడిందంటారు. ఇదే ఆయన వీక్‌నెస్ అంటారు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఈయన కూడా.. కొన్ని కొన్ని సినిమాలకు డబ్బులు వెనక్కి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొన్నారు.