ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే సామ్ కుర్రాళ్లను మాయ చేసింది. ఈ సినిమాలో సమంత అందం అభినయానికి అంతా ఫిదా అయ్యారు. ఆ తరవాత సమంత టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంది. అసలు స్టార్ హీరోలే స్వయంగా సమంతను తమ సినిమాల కోసం రికమెండ్ చేశారు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంతో చైతూతో సామ్ ప్రేమలో పడింది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ గతేడాది వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు.
విడాకులు తీసుకున్నప్పటి నుండి సామ్ సపరేట్ గా ఉంటోంది. విడాకుల తరవాత సమంత మానసికంగా చాలా కృంగిపోయింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నానని ప్రకటించింది. బెడ్ పై పడుకుని యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను ఈ సంధర్బంగా షేర్ చేసింది. దాంతో అందరూ పాపం సమంత అని బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఆరోగ్యపరిస్థితి పై ఒకప్పటి దర్శకుడు గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమంత మోడలింగ్ చేస్తున్న సమయం నుంచి తనకు తెలుసు అని చెప్పాడు. సమంతకు మొదట కడలి సినిమాలోనే అవకాశం వచ్చిందని అన్నాడు. కానీ ఆ సినిమా కోసం సముంద్రం నీటిలో దిగాలని తనకు చర్మ సంబంధిత సమస్యలు ఉన్న కారణంతో సమంత ఆ సినిమాకు నో చెప్పిందని తెలిపాడు. అంతే కాకుండా నిజంగా సమంతకు వ్యాధి తీవ్రంగా ఉండి ఉంటే యశోద సినిమా ప్రమోషన్ లో పాల్గొనదు అంటూ కామెంట్స్ చేశాడు.
సమంత కేవలం సింపతీ కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సమంతకు నిజంగా ఆ వ్యాధి ఉన్నా అది సీరియస్ కాదు అంటూ వ్యాఖ్యానించాడు. ఆమె చికిత్స తీసుకుంటుందని అంతే కాకుండా సమంతను చూసుకోవడానికి ఆమె తల్లి దండ్రులు ఉన్నారని అన్నారు. అలాంటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో చేయడం అవసరం లేదని గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు.
సమంతకు రీసెంట్ గా విడాకులు అవ్వడం..ఐటమ్ సాంగ్స్, గ్లామర్ ఫోటో షూట్ ల వల్ల నెగిటివిటి వచ్చిన కారణంగానే సమంత తన వ్యాధి గురించి పబ్లిక్ గా చెప్పుకుందని సంచలన ఆరోపణలు చేశాడు. ఇక ప్రస్తుతం గీతాకృష్ణ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు.