ము.. ము ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా అన్నాడో కవి… మామూలుగానే ముద్దంటే ఎవ్వరికి చేదు ఉండదు. అయితే అదే పనిగా ముద్దులు పెట్టుకోవాలంటే కాస్త ఇబ్బందే. ముద్దంటే స్వల్పకాలం లేదా కొద్దిసేపు పెట్టుకునే ఓ కిస్. ఆ టైంలోనే ఆ మజా ఉంటుంది. అయితే ఎవ్వరూ కూడా ఎక్కువ సేపు ముద్దు పెట్టుకోవాలంటే ఆ ఫీల్ ఉండదు. అయితే ఓ జంట మాత్రం ప్రపంచంలోనే సుధీర్ఘమైన ముద్దు పెట్టుకున్న జంటగా గిన్నీస్‌బుక్‌లోకి ఎక్కింది.
అసలు ఈ జంట ఎంత సేపు లిప్‌కిస్ పెట్టుకున్నారో తెలిస్తే షాక్ అవుతాం.. ఏకంగా 58 గంటల 35 నిమిషాల 58 సెకెన్ల పాటు వీరు ముద్దు పెట్టుకున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట 2013లో లాంగెస్ట్ కిస్ చేసుకుని వరల్డ్ రికార్డు నెలకొల్పారు. అసలు వీళ్లు 2 రోజులకు పైగా ముద్దు పెట్టుకుని రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ జంట రికార్డును అదే దేశానికి చెందిన మరో జంట బ్రేక్ చేసి పెద్ద సంచలనం రేపారు.
కొత్త జంట ఎకాసి-లక్సానా 58 గంటల 35 నిమిషాల 58 సెకెన్ల పాటు వీళ్లు లిప్ కిస్ పెట్టుకున్నారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పట్టాయ నగరంలోని ఫిబ్రవరి 12 – 14 తేదీల మధ్య ఈ రికార్డు నమోదు అయ్యింది. ఓ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనేక జంటలు పాల్గొన్నాయి. ఈ జంట తమతో పాటు ఈ పోటీలో పాల్గొన్న 9 జంటలను దాటి మరీ ఈ రికార్డు నమోదు చేసింది.
అయితే ఈ రికార్డ్ కోసం వాళ్లు చాలా కష్టపడాల్సి ఉంది. వీళ్లు ఆహారం తీసుకునేటప్పుడు, చివరకు బాత్రూమ్కు వెల్లినప్పుడు కూడా పెదవులు వదల్లేదు. కేవలం స్ట్రా ద్వారా ద్రవపదార్థాలు మాత్రమే తీసుకున్నారు. రెండు రోజుల పాటు నిద్రపోకుండా అలా ముద్దుపెట్టుకోవడం అంటే చాలా ఓపిక ఉండాలి. మరీ బాత్రూమ్కు వెళ్లేటప్పుడు కూడా వీరు పెదవులు గట్టిగానే పట్టుకుని ఉంచుకున్నారు. ఇంత కష్టపడినందునే ఈ గిన్నీస్ రికార్డ్ వాళ్ల సొంతమైంది. ఈ రికార్డు మరో పదేళ్ల వరకు ఖచ్చితంగా నిలబడుతుందని గిన్నీస్ వాళ్లు అంచనా వేస్తున్నారు.