ఎస్ ..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది . అంతేకాదు తెల్లవారుజామున ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన హాస్పిటల్ లో అడ్మిట్ చేసినట్లు ఘట్టమనేని కాంపౌండ్ నుండి ఓ న్యూస్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రిలో కృష్ణకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం . దీంతో మహేష్ బాబు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తుంది .
కాగా రీసెంట్ గానే సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి అనారోగ్య కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర డిప్రెషన్ లోనై ఫుల్ బాధపడుతున్నారట. ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అని ..ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదని తెలుస్తుంది . గత వారం రోజుల నుండి సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఏం బాగోలేదట ..ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా కానీ.. తెల్లవారు జామున ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లిన్నట్లు తెలుస్తుంది.
అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ వెంటిలేటర్ పై ఉన్నారట. శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట . దీంతో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు . ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.