నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ కూడా గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే రెండో సీజన్లో కూడా వచ్చిన ఎపిసోడ్లు అన్నీ బాగా పేలాయి. ఫస్ట్ ఎపిసోడ్లో చంద్రబాబు, లోకేష్ రావడం.. తర్వాత రెండు, మూడు ఎపిసోడ్లకు టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్, అడవి శేష్ వచ్చారు. ఇక నాలుగో ఎపిసోడ్‌కు బాలయ్యకు చిన్నప్పటి క్లాస్మేట్స్ మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్, ప్రస్తుత తెలంగాణ ఎంపీ సురేష్‌రెడ్డి వచ్చారు. వీరితో పాటు సీనియర్ నటి రాధిక కూడా ఈ ఎపిసోడ్‌లోకే వచ్చారు.
ఇక ఈ ఎపిసోడ్లో ఆసక్తికరమైన ట్విస్టులు చాలానే బయటకు వచ్చాయి. చివర్లో పై ముగ్గురు గెస్టులతో పాటు ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఆ ఇద్దరిలో ఒక స్నేహితుడు ఆశ గుర్తుందా ? అని అడిగిన వెంటనే బాలయ్య ఆ ఎందుకు గుర్తు లేదు.. ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ అని చెప్పగా… అతడు బాలయ్య ఇన్సిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు.. మీకు తెలియని విషయం ఇంకోటి ఉందని చెప్పగా బాలయ్య వెంటనే ఆ స్నేహితుడి నోరు మూసేశాడు.
ఈ సంభాషణ బట్టి చూస్తుంటే ఆశ బాలయ్య క్లాస్మేట్ అని… మొత్తానికి బాలయ్య చదువుకునే రోజుల్లో ఏదో చిన్న చిలిపి సరదా ఆయన జీవితంలో ఉండే ఉంటుందన్న చర్చ నడుస్తోంది. కొంతమంది అభిమానులు మాత్రం బాలయ్య నోరు మూసేశాడు అంటే ఆశ బాలయ్య ఫస్ట్ క్రష్ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఎప్పుడు అయినా బాలయ్య ఆశ గురించి చెప్పవచ్చని కూడా మరి కొందరు అంటున్నారు.
ఇక మీ జీవితంలో అత్యంత సంక్లిష్టమైన పాత్ర ఏది అన్న ప్రశ్నకు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాత్ర అని చెప్పాడు. బాలయ్య అస్సలు హీరో అవుతాడని తాను అనుకోలేదని కిరణ్‌కుమార్ రెడ్డి అన్న వెంటనే బాలయ్య నువ్వు సీఎం అవుతావని నేను అనుకోలేదని కౌంటర్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ నాలుగో ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.