నందమూరి నరసింహ బాలకృష్ణ వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న బాలయ్య ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక రీసెంట్గా బాలయ్య 20 ఏళ్ళ క్రితం వచ్చిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 పేరుతో సీక్వెల్ ప్లాన్ చేసినట్టు విశ్వక్సేన్ ధమ్కీ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి.
బాలయ్య చెప్పిన ఆదిత్య 999 సీక్వెల్ తోనే తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందని కూడా ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అఖండ సినిమా నుంచి బాలయ్య పర్సనల్ లైఫ్‌లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. బాలయ్య లుక్‌తో పాటు ఆహార్యం కూడా మారిపోయింది. బాలయ్య వయస్సు 60 ఏళ్లు దాటిపోయినా మనసు మాత్రం 30 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతోంది.
బాలయ్య కుర్ర హీరోలతో అన్‌స్టాపబుల్ షోలో చేస్తోన్న అల్లరి, వాళ్లను ప్రశ్నలతో ఆడుకునే టైమింగ్ అయితే మామూలుగా లేదు. బాలయ్య లుక్ కూడా యంగ్‌గా కనిపిస్తోంది. అయితే ఈ లుక్ మార్పు వెనక ఆయన చిన్న కుమార్తె తేజస్విని ఉందని అంటున్నారు. ఇక ముందు కూడా బాలయ్య చేసే అన్ని సినిమాలకు ఆమే కాస్ట్యూమ్ డిజైనర్‌గాను, ప్రొడక్షన్ డిజైనర్‌గాను వ్యవహరించనుందట.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఆదిత్య 999 సినిమా పూర్తి బాధ్యతలను కూడా తేజస్వినియే తన భుజ స్కంధాల మీద వేసుకోనుందని తెలుస్తోంది. అంటే సినిమా కథ విని.. సెట్స్‌మీదకు వెళ్లేముందు వరకు ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవడంతో పాటు సినిమాలో తన తండ్రి లుక్స్, కాస్ట్యూమ్స్ విషయంలో ఆమె పూర్తిగా కేర్ తీసుకోనుందట. అలాగే ఈ సినిమాతోనూ మోక్షజ్ఞ కూడా తెలుగు తెరకు పరిచయం కానున్నట్టు టాక్ ? మరి తేజస్విని ఎంట్రీతో బాలయ్య, మోక్ష సినీ కెరీర్‌కు ఎంత వరకు కలిసి వస్తుందో ? చూడాలి.