సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యామిలీని వరుసగా దురదృష్టాలు వెంటాడుతున్నాయి. గత యేడాది కాలంలో కృష్ణ ఇంట్లో ముగ్గురు మృతి చెందడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటే. ఇప్పటికే జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్‌బాబు అనారోగ్యంతో మృతి చెందారు. కాలేయ వ్యాధితో బాధపడుతోన్న రమేష్‌బాబు తీవ్ర అనారోగ్యంతో చిన్న వయస్సులోనే మృతి చెందడం కృష్ణను తీవ్రంగా కలిచి వేసింది. తాను ఉండగానే రమేష్‌బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం కృష్ణను ఎంతో బాధపెట్టింది.
ఇటు తండ్రి వయస్సు పైబడడంతో తనకు అన్ని విధాలా అండగా ఉంటాడనుకున్న అన్న రమేష్‌బాబు మృతి మహేష్‌ను ఎంతో బాధపెట్టింది. ఆ బాధ నుంచి కోలుకోక ముందే మహేష్‌బాబు ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహేష్ తల్లి ఇందిరాదేవి సెప్టెంబర్ 28న మృతిచెందింది. కొన్నేళ్ల క్రితమే విజయనిర్మల మృతితో కృష్ణ తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
కృష్ణ పెద్ద భార్య ఇందిరాదేవి అయినా కూడా కృష్ణ సినిమా రంగంలో ఉండడంతో అవుట్ డోర్ షూటింగ్‌లు వెళ్లినప్పుడు విజయనిర్మలే స్వయంగా కృష్ణ ఆరోగ్యాన్ని దగ్గరుండి మరీ చూసుకునేవారు. అలాంటి విజయనిర్మల మృతికి తోడు ఇందిరాదేవి కూడా తనను విడిచి వెళ్లిపోవడంతో కృష్ణ బాధతోనే కుమిలిపోతోన్న పరిస్థితి. ఇక ఇప్పుడు ఆయనే స్వయంగా తన కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయారు.
యేదేమైనా 8 నెలల వ్యవధిలోనే ఏకంగా ముగ్గురు మృతిచెందడం ఇటు మహేష్‌బాబుకు ఎంతో తీరని శోకం. నెలల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మృతిచెందడం ఆ ఫ్యామిలీకి ఓ బ్యాడ్ సెంటిమెంట్‌గా మారింది. మహేష్ ఈ విషాదాల నుంచి త్వరగా కోలుకుని యాక్టివ్ అవ్వాలని ఘట్టమనేని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.