Moviesఅనుష్క ఆంటీ నా.. అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా...

అనుష్క ఆంటీ నా.. అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా స్వీటి ఇరుక్కునేసిందిగా..!!

రీసెంట్గా ఆంటీ అనే పదం ఎంత వైరల్ గా మారుతుందో మనకు తెలిసిందే. యాంకర్ అనసూయను ఓ హీరో ఫ్యాన్స్ ఆంటీ అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . ఆ విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి . కాగా ప్రజెంట్ అదే ప్రాబ్లంను ఎదుర్కొంటుంది హీరోయిన్ అనుష్క శెట్టి . ఎస్ మన ముద్దుగుమ్మ స్వీటీ ని ఆంటీ ఆంటీ అంటూ హీరో తెగ ఏడిపిస్తున్నాడట. దీంతో అనుష్కకి కోపం వచ్చేసి ఆ హీరోని లాగ పెట్టి కొడుతుందట . అమ్మాయిలని ఆంటీ అంటే ఎంత కాలుతుందో..అతగాడికి తెలిసి వచ్చేలా చేసింది. అక్కడే అసలు కాదు మొదలవుతుంది.

ఎస్ ఇదంతా అనుష్క నటించిన తదుపరి సినిమా స్టోరీ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి గతంలో సినీ ఇండస్ట్రీని ఊపు ఊపేసింది. ప్రజెంట్ సినిమాలను తక్కువగా సెలెక్ట్ చేసుకున్న అనుష్క త్వరలోనే నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాతోమన ముందుకు రాబోతుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. కాగా ఇది అనుష్క 48వ చిత్రం . మిర్చి , భాగమతి ల తర్వాత యూవీ క్రియేషన్ సంస్థలు నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇదే కావడంతో సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనున్నారు అనుష్క ఫ్యాన్స్.

కాగా రీసెంట్గా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. చెఫ్ పాత్రలో కనిపించింది స్వీటీ. అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఒక లవ్ స్టోరీ అంటున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ అనుష్కకు పెళ్ళంటే అసలు ఇష్టం ఉండదు. ఏజ్ దాటిపోతున్నా కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటుంది. ఈ క్రమంలోని నవీన్ పోలీశెట్టి మొదట ఆమెను ఆంటీ ఆంటీ అంటూ ఏడిపిస్తాడు ..ఇక్కడే కధ స్టార్ట్ అవుతుంది ..ఆ తర్వాత అనుష్క లోని మంచితనం చూసి వయసుతో సంబంధం లేదు ఆమె బిహేవియర్ మనసు మంచిది అంటూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తాడు .ఈ క్రమంలోనే వాళ్ళమధ్య వచ్చిన కామెడీ ట్రాక్ డైలాగ్స్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయని.. మరీ ముఖ్యంగా వీళ్ళు మధ్యలో వచ్చే స్పెర్మ్ డోనర్ కాన్సెప్ట్ జనాలను కడుపుబ్బ నవ్విస్తుందని జనాలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే అనసూయ ఆంటీ కాన్సెప్ట్ తో ఇప్పుడు ఏకంగా ఓ సినిమానే తెరకెక్కించేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news