అనుష్క శెట్టి.. స్వీటీ అంటూ అందరి చేత ముద్దుగా పిలవబడే ఈ అమ్మడు నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా తొలిసారిగా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఏ సినిమా యావేరేజ్ గా నిలిచినా అనుష్క నటన మాత్రం అందరిని ఆకట్టుకుంది. దాంతో ఆమెకు వరస అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో ఆమె హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. మరి ముఖ్యంగా అరుంధతి, రుద్రమ దేవి వంటి సినిమాలు ఆమెను తారా స్థాయికి చేర్చాయి. సినిమాల్లో ప్రయోగాలకు ఎప్పుడు ఒకే చెప్పే అనుష్క సైజ్‌జీరో వంటి సినిమాతో లావెక్కే ప్రయోగం చేసి దాదాపు కెరీర్ కోల్పోయింది.
2020 లో నిశ్శబ్దం సినిమాలో చివరగా కనిపించిన అనుష్క మళ్ళి ఏ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అందుకు కారణం ఆమె బాగా బరువు పెరగడమే. ఇక ఆమె సినిమా జీవితం కాసేపు పక్కన పెడితే ఆమె కెమెరా పర్సన్ తో ఇష్యూ అప్పట్లో కోలీవుడ్ లో పెద్ద సంచలనం అయ్యింది. ఆమె మేకప్ ఆర్టిస్ట్ యూనియన్‌లో సభ్యురాలిగా లేకపోవడంతో అసలు వివాదం మొదలయ్యింది. 2012లో ఈ ఇష్యూ జరగగా ఈ విషయం గా ఆమె చాల బాధ పడినట్టుగా సమాచారం.
అయితే ఇలా ఆమె సొంతంగా యూనియన్ తో సంబంధం లేకుండా ఒక వ్యక్తిని పెట్టుకోవడం అప్పటి యూనియన్ మెంబర్స్ కి నచ్చలేదు. దాంతో ఆమెపై లీగల్ గా ఫైట్ చేయాలని అనుకున్నారు. అనుష్క శెట్టి ఇంతకుముందు తన మేకప్ ఆర్టిస్ట్‌ను తమిళ ఫిల్మ్ వర్కర్స్ యూనియన్ బయటకు పంపించినప్పుడు అతనికి అండగా నిలిచింది. సూర్య సోదరుడు కార్తీతో అలెక్స్ పాండియన్ షూటింగ్ సమయంలో, పక్క రాష్ట్రానికి చెందిన మేకప్ ఆర్టిస్ట్‌ను నియమించుకుంది. ఇందుకు అనుష్క పై సుమారు 30 మంది సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
గిల్డ్‌లో ఆమె పేరును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే గొడవ జరిగిన రోజు ఈ సమస్యను పరిష్కరించేందుకు కార్తీ జోక్యం చేసుకుని అనుష్క మేకప్ ఆర్టిస్ట్‌ని సెట్స్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. అయితే ఈ ఘటనతో హర్ట్ అయిన అనుష్క సొంతంగా మేకప్ వేసుకోవాలని, యూనియన్ నుంచి ఎవరిని నియమించుకోకూడని నిర్ణయించుకుంది. ఇక ఈ ఘటన అనుష్క శెట్టిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సమాచారం. అప్పటి వరకు తాను నటించిన అన్ని సినిమాలకు యూనిట్ మెంబర్స్ కి బహుమతులు ఇచ్చే అనుష్క అప్పటి నుంచి ఎవరికీ ఎలాంటి గిఫ్ట్స్ అవ్వడం లేదట.
కేవలం మొదట తన నుంచి కార్ ను గిఫ్ట్ గా పొందిన తన సొంత డ్రైవర్ కి మాత్రమే ఆమె కొన్ని బహుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. షూటింగ్ సమయంలో జరిగిన ఈ ఘటన వల్ల అనుష్క ఏడ్చినట్లు, కార్తీ ఆమెను ఓదార్చినట్టు కూడా సమాచారం. తమిళ ఫిల్మ్ వర్కర్స్ యూనియన్ సభ్యుల నుండి తనకు ఎదురైన వేధింపులపై అనుష్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందట. కొన్నాళ్ళకు ఈ గొడవ సర్దు మునిగిన అనుష్కను ఏడిపించిన ఘనత మాత్రం తమిళ సినిమాలకే చెల్లింది.