Moviesశిరీష్ ను పెళ్లి చేసుకుంటావా..? అను ఆన్సర్ కి షాక్ అయిన...

శిరీష్ ను పెళ్లి చేసుకుంటావా..? అను ఆన్సర్ కి షాక్ అయిన అల్లు అరవింద్..!!

ఊర్వశివో రాక్షసివో ఈ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. గత కొన్నాళ్లుగా హీరో శిరీష్ హిట్ ఎప్పుడు కొడతాడా అంటూ వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ధియేటర్స్ గ్రాండ్ గా రిలీజ్ అయిన ఊర్వశివో రాక్షసివో మూవీ మిక్స్డ్ టాక్ సంపాదించుకునింది. ఈ సినిమా అల్లు శిరీష్ ను కొంచెం ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇప్పటివరకు ఈ హీరో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే .

శ్రీరస్తు శుభమస్తు సినిమా ఓ మోస్తరుగా అనిపించిన ఆ క్రెడిట్ మొత్తం లావణ్య త్రిపాఠి వేసుకునేసింది. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ చాలా ఏళ్లు గ్యాప్ తీసుకొని చేసిన మూవీ ఊర్వశివో రాక్షసివో .కాగా ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ తో శిరీష్ ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరి రొమాన్స్ చేసాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీళ్ళకి సంబంధించిన లిప్ కిస్ లు.. హాట్ సీన్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసిన జనాలు.. వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఫిక్స్ అయిపోయారు.

అయితే రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన అను ఇలాంటి వార్తలు విన్న అల్లు అరవింద్ తనని ఏం అడిగారో చెప్పుకొచ్చింది.” మీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారా ..?”అంటూ అడిగేసారని ఆమె చెప్పుకొచ్చింది. దీనికి అను ..”అలాంటిది ఏమీ లేదు మేం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంకుల్” అంటూ ..”ఇలాంటి గాసిప్ క్రియేట్ చేసే వాళ్ల గురించి కబుర్లు ఆడుతూ పొట్ట చెక్కలయ్యాల నవ్వుకున్నామని “చెప్పుకొచ్చింది . అంతేకాదు శిరీష్ నాకు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ తేల్చి చెప్పేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news