టాలీవుడ్ లో మెగా యంగ్ హీరోల ప్రేమాయణం వార్తలు గత కొద్ది రోజులుగా బాగా వైరల్ అవుతున్నాయి. ముందుగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ – రెజీనా ప్రేమ విషయం ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. రెజీనా – సాయిధరమ్ తేజ్ మూడు సినిమాల్లో జంటగా కనిపించడంతో పాటు బయట కూడా సన్నిహితంగా ఉండడంతో వీరిద్దరూ పేకల్లోతు ప్రేమలో ఉన్నారన్న వార్తలు బలంగా వచ్చాయి. ఆ తర్వాత మరో మెగా హీరో వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి కూడా రిలేషన్ లో ఉన్నారని… త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి.
ఇక కొద్ది రోజులుగా అదే మెగా ఫ్యామిలీకి చెందిన మరో యంగ్ హీరో అల్లు శిరీష్, కుర్ర హీరోయిన్ అను కూడా ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు శిరీష్ కూడా అందుకు తగినట్టుగా తన ప్రేమ పెళ్లిపై లీకులు ఇస్తూ మరింత టెన్షన్ పెట్టేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి `ఊర్వశివో రాక్షసివో` సినిమాలో జంటగా కనిపించారు. ఈ సినిమా షూటింగ్లో వీరిద్దరూ ప్రేమలో పడడంతో పాటు చెట్టపట్టాలేసుకొని తిరుగుతూ చాలామంది కళ్లల్లో పడ్డారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో అను, శిరీష్ కలిపి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శిరీష్ పక్కనే ఉన్న అనును మీరు సింగల్ గా ఉన్నారా? లేక లవ్ లో ఉన్నారా? అని ప్రశ్నించగా.. ఆమె చాలా ఇబ్బంది పడింది. దీనిపై సరైన క్లారిటీ ఇవ్వలేక తాను సింగిల్ గా లేనని… అలా అని ప్రేమలో కూడా ఉన్నట్టు కాదని తెలివిగా ఆన్సర్ చేసింది. అయితే పక్కనే ఉన్న శిరీష్ మాత్రం ఆమె చెప్పిన ఆన్సర్ను ఖండించాడు.
అను ప్రేమలో ఉందన్న విషయం తనకు తెలుసని.. ఆమె ఎప్పుడు చూసినా తన మొబైల్ చూసుకుని అందులో వచ్చే మెసేజ్లు చదువుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుందని.. కొన్నిసార్లు సిగ్గుపడుతుందని, ప్రేమలో ఉన్నవాళ్లే అలా చేస్తారని, శిరీష్ ఆమె ప్రేమమా విషయాన్ని బట్టబయలు చేశాడు. ఇక శిరీష్, అను ప్రేమ గురించి అంత చక్కగా క్లారిటీ ఇచ్చాడంటే నిజంగానే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారా? అన్న సందేహాలు కూడా చాలామందికి కలుగుతున్నాయి.