Moviesచిరంజీవిని మ‌ళ్లీ టార్గెట్ చేసిన అల్లు అర‌వింద్‌... గొడ‌వ‌లు ముదిరి పాకాన...

చిరంజీవిని మ‌ళ్లీ టార్గెట్ చేసిన అల్లు అర‌వింద్‌… గొడ‌వ‌లు ముదిరి పాకాన ప‌డ్డాయా…!

మెగా ఫ్యామిలీలో విభేదాల గురించి గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అని.. అయితే తమ వారసుల మధ్య వృత్తిపరమైన పోటీ మాత్రమే ఉందని పదేపదే చెబుతున్నా జరుగుతున్న పరిణామాలు మాత్రం రకరకాల సందేహాలకు కారణం ఇస్తున్నాయి.
ఎన్ని గొడవలు ఉన్నా… ఎన్ని కవరింగ్ లు ఉన్న చెబుతోంది ఒకటి… జరుగుతుంది మరొకటి అన్నట్టుగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా అట్టర్ ప్లాప్ అయింది.. అసలు ఆ సినిమాను అల్లు అరవింద్ ఎంత మాత్రం పట్టించుకోలేదు అన్నది వాస్తవం.

చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రీ ఇచ్చినప్పుడు అల్లు అరవింద్ అంతా తానై నడిపించారు. థియేటర్లు కేటాయించడం దగ్గర నుంచి.. సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి కలెక్షన్లు అదిరిపోయాయని చెప్పారు. ఆ సినిమా ప్రమోషన్ల వెనక కూడా అరవింద్ కీలకపాత్ర పోషించారు.సైరా సినిమా దగ్గరకు వచ్చేసరికి కాస్త గ్యాప్ పెరిగింది. ఆచార్యను అస్సలు పట్టించుకోలేదు.. ఇక విచిత్రంగా గాడ్ ఫాదర్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. సినిమా కలెక్షన్లు బాగున్నాయి అనుకుంటున్న సమయంలో అల్లు అరవింద్ కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారాను భారీ ఎత్తున తెలుగులో విడుదల చేశారు.

కాంతారాకు హిట్ టాక్ రావడంతో గాడ్ ఫాదర్ వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఇక అరవింద్ ఇప్పుడు బాలయ్యతో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. వచ్చే సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న విజ‌య్‌ వారసుడు సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు సినిమాలకు థియేటర్ల ఒప్పందం కూడా జరుగుతుంది. అయితే తమిళ సినిమాలకు తెలుగు నాట థియేటర్లో ఇవ్వకపోతే… తెలుగు సినిమాలను తాము రానివ్వమని తమిళ జనాల నుంచి వ్యతిరేకత మొదలైంది.

వారసుడు దిల్ రాజు సొంత సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ టైంలో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఉన్నా కూడా ఒక తమిళ సినిమాకు… ఈ సినిమాలు కన్నా ఎక్కువ థియేటర్లో ఎలా కేటాయిస్తారని అంటున్నారు. మంచి థియేటర్లు అన్ని వార‌సుడికే వెళ్ళిపోతున్నాయి అన్న విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై అల్లు అరవింద్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

ఇలాంటి సమయంలో అల్లు అరవింద రంగంలోకి దిగి మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాకు మంచి థియేటర్లు దొరికేలా చేస్తారని మెగా అభిమానులు భావించారు. అయితే అందుకు వ్యతిరేకంగా అరవింద్ డబ్బింగ్ సినిమాలను అడ్డుకోవడం అస్సలు సాధ్యం కాదని చెప్పారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి, టాలీవుడ్ లో కీలకమైన వ్యక్తి అయిన అరవింద్ అలా మాట్లాడ‌డం.. మెగాభిమానుల‌కు రుచించ‌డం లేదు. కేవలం తెలుగు సినిమాలకే థియేటర్లు ఇవ్వాలనడం కూడా జరిగే పని కాదని చెప్పారు.

ఓ వైపు తన బావమరిది సినిమా, ఇటు బాలయ్య సినిమాతో పోటీపడుతోంది.. థియేటర్ల విషయంలో కానీ ప్రమోషన్ల పరంగా కానీ అరవింద్ స్వయంగా కలుగ చేసుకుని వాల్తేరు వీరయ్యకు కాస్త హైప్‌ వచ్చేలా తన వంతు కృషి చేయాల్సింది పోయి… ఇలా మాట్లాడడంతో మెగా అభిమానులు రగిలిపోతున్నారు. ఏదేమైనా రెండు కుటుంబాల మధ్య ఎంత లేదనుకున్న గొడవలు ముదిరి పాకాన పడుతున్నట్టే ఉందన్న చర్చల‌ నేపథ్యంలో ఇప్పుడు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మరింత మంట పెట్టేసాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news