Moviesకూతురు కి వెరైటీ పేరు..మాజీ బాయ్ ఫ్రెండ్ పేరు కలిసొచ్చేలా అలియా...

కూతురు కి వెరైటీ పేరు..మాజీ బాయ్ ఫ్రెండ్ పేరు కలిసొచ్చేలా అలియా సంచలన నిర్ణయం..!?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . పెళ్లికి ముందే కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట.. ఆ ఎఫెక్ట్ కారణంగా పెళ్లైన రెండు నెలలకే మూడో నెల అంటూ అభిమానులకి డబుల్ బొనాంజ ఇచ్చారు. ఈ క్రమంలోని ఆ టైంలో ఆలియా భట్ పై సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది . కానీ అలాంటి విషయాలను పట్టించుకోని ఆలియా.. రణబీర్ సినిమా ప్రమోషన్స్ లో కూడా జాలీగా చేశారు.

ప్రెగ్నెంట్ అయినా ఆలియా కూడా బేబీ బంప్ తో ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంది . దీంతో బ్రహ్మాస్త్ర సినిమా భారీ బ్లాక్ బస్టర్గా నమోదయింది. కాగా రీసెంట్గా నవంబర్ 6న అలియా భట్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది .మహాలక్ష్మి లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆలియా గతవారం ఆస్పత్రి నుండి ఇంటికి చేరుకుంది. అంతేకాదు తన బిడ్డను చూడడానికి వచ్చేవాళ్ళకి క్రేజీ కండిషన్స్ పెట్టింది . కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ కంపల్సరీ అంటూనే ..త్రీ డేస్ క్వారంటైన్ అనే బిగ్ షాక్ ఇచ్చింది.

దీంతో అలియా పాపని చూడడానికి భయపడిపోతున్నారు సన్నిహితులు. కాగా కూతురికి అదిరిపోయే పేరు ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దివంగత నటుడు రణబీర్ తండ్రికి నివాళిగా ఆమె కూతురుకు రిషి అని పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాలని రణబీర్ ఆలియా ఫిక్స్ అయ్యారట . అంతేకాదు తల్లి ముద్దుగా తన మాజీ బాయ్ ఫ్రెండ్ పేరు కలిసి వచ్చేలా “అరా” అని పిలుచుకుంటుందట . తన పేరు లోని మొదటి అక్షరం..మాజీ బాయ్ ఫ్రెండ్ రణ్వీర్ సింగ్ లోని మొదటి లెటర్ . దీంతో రన్బీర్ కపూర్ కి కోపం వచ్చినా తన తండ్రి పేరుని పెట్టిందన్న పాజిటివ్ వైబ్ తో లైట్ తీసుకుంటున్నాడట . అయితే ఆలియా మాత్రం అది తన ఫేవరెట్ పేరు అని మాజీ బాయ్ ఫ్రెండ్ పేరు అయితే కాదని ఫ్రెండ్స్ కి క్లారిటీ ఇచ్చిందట. ఏది ఏమైనా సరే అలియా భట్ కూతుర్ని అలా మాజీ బాయ్ ఫ్రెండ్ పేరు కలిసి వచ్చేలా పిలవడం అత్తగారు నీతూ కపూర్ కి అస్సలు నచ్చడం లేదట . ఈ క్రమంలోనే ఆమె అలియా పై ఫైర్ అయినట్లు కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news