కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుందో మనకు తెలిసిందే. పెళ్లితోనే ఈ అమ్ముడు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ టైంలో పెళ్లి ఫొటోస్ బయటకు రానివ్వకుండా నానా రచ్చ చేసి సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా ట్రోల్ అయింది . ఇక పెళ్లి తర్వాత తిరుములలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ కాళ్లకు చెప్పులు వేసుకుని హిందూ సాంప్రదాయాలను పట్టించుకోకుండా బిహేవ్ చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అయింది.
ఇక తర్వాత తన పెళ్లికి సంబంధించిన డీల్ తో నెట్ ఫిక్స్ కండిషన్స్ ను ఉల్లంఘించి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది . ఇక ఆ తర్వాత ఎవరు ఊహించిన విధంగా పెళ్లైన నాలుగు నెలలకి ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయ్యి షాక్ ఇచ్చింది. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బ్యాడ్ ఇన్ సిడెంట్స్ తో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న నయనతార మరోసారి బిగ్ చిక్కుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. ఎస్ మనకు తెలిసిందే నయనతార కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నింది.
పెళ్లికి ముందే వీళ్ళు కొన్నాళ్లు డేటింగ్ చేశారన్న రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అప్పటికే వీళ్లిద్దరూ కలిసి సౌదీలో పెట్టుబడులు పెట్టుకోచ్చారట. ఓ కంపెనీలో ఇద్దరు కలిసి పెట్టుబడులు పట్టుకొచ్చినట్లు తెలుస్తుంది .కాగా అప్పటికి వీళ్ళకి పెళ్లి కాలేదు ..ఆ అగ్రిమెంట్లో వీళ్ళిద్దరూ విడివిడిగానే సంతకం చేస్తూ వుయ్ ఆర్ నాట్ మ్యారీడ్ అన్న అంశాన్ని గుర్తు చేశారు. అయితే రీసెంట్గా కవల పిల్లల విషయంలో నయనతార విగ్నేష్ శివన్ ప్రభుత్వానికి ..మేము ఆరేళ్ల ముందే పెళ్లి చేసుకున్నాం అంటూ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించారు . దీంతో మరోసారి నయనతార చిక్కులో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది .
ఒకవేళ నిజంగా మీకు పెళ్లి అయ్యి ఉంటే అప్పుడు ఎందుకు మీరు విడివిడిగా సైన్ చేశారు అంటూ తమిళనాడు ప్రభుత్వం ప్రశ్నించే ఛాన్సెస్ ఉన్నట్లు తెలిసింది . ఒకవేళ ఇదే నిజమైతే మళ్లీ నయనతార విగ్నేష్ శివన్ కవల పిల్లలు సరోగసి ప్రాసెస్ లో అడ్డంగా బుక్ అయినట్లే అంటూ జనాలు చెప్పుకుంటున్నారు చూద్దాం..ఈ ఇష్యూ మళ్ళీ ఎలా ఎండ్ అవుతుందో..?