Moviesహీరోయిన్ అదితిని క‌మిట్మెంట్ అడిగింది ఎవరు.. నో చెప్ప‌డంతో అంత వేధించారా...!

హీరోయిన్ అదితిని క‌మిట్మెంట్ అడిగింది ఎవరు.. నో చెప్ప‌డంతో అంత వేధించారా…!

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన తమిళ సినిమా కాట్రువెలిఈడై తో కోలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ అదితిరావ్ హైదరి. మొద‌టి సినిమాతోనే ఈ బ్యూటీ కుర్రాలను తన వైపు తిప్పుకుంది. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. రీసెంట్ గా తెలుగులో మహాసముద్రం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించకపోవడంతో టాలీవుడ్ లో అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూల‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే…అయితే అధితిరావు కూడా ఓ ఇంటర్వ్యూలో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాలను బ‌య‌ట‌పెట్టింది. అధితి రావు మాట్లాడుతూ వారసుల కంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారికి అవకాశాల కోసం పడకగది వేధింపులు ఎక్కువ అని నేను చెప్పడం లేదు… కానీ నా గురించి మాత్రం చెప్పగలను అంటూ చెప్పుకొచ్చింది. కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవారు ల‌క్ష్యం దిశగా ముందుకు వెళ్లాలని చెప్పింది. అయితే అది అసాధ్యం కాదని దానికి ఉదాహరణ తానే అని తెలిపింది.

అడ్జస్ట్ అవ్వని కారణంగా మూడు సినిమాల నుంచి తనను తప్పించార‌ని వెల్లడించింది. గౌరవంగా జీవించాలని లక్ష్యంగా తాను జీవిస్తున్నానని… గౌరవం, మర్యాద ముఖ్యమని కామెంట్ చేసింది. దానికి అవకాశాలు పోయినా పరవాలేదు అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా మహిళలకు సినిమా రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ సరైన భద్రత లేదంటూ అధితీరావు కామెంట్స్ చేసింది. అన్నిరంగాల‌లో విభిన్నమైన వ్యక్తులు ఉంటారని.. కొందరు మర్యాదగా నడుచుకుంటే మరి కొందరు మహిళలపై అగైత్యాలకు పాల్పడుతుంటారని తెలిపింది.

సమాజంలో స్త్రీలు ఎదగడం కష్టమే…. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక తాను స్టార్ హీరోయిన్ కాలేదని చాలామంది అడుగుతున్నారని దానికి తన వద్ద సరైన సమాధానం లేదని చెప్పింది. కానీ తనకు వస్తున్న అవకాశాలతో సంతోషంగా ఉన్నానని పేర్కొంది. ఇప్పటికే తాను ప్రముఖ దర్శకుల సినిమాల్లో నటించాన‌ని దాంతో నెంబర్ వన్ హీరోయిన్ కాలేకపోయాను అన్న బాధ లేదని చెప్పింది. కొందరు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం విజ‌యంగా భావిస్తారని మరికొందరు అవార్డులను గెలుచుకోవడాన్ని సక్సెస్ గా భావిస్తానని చెప్పింది.

తాను మాత్రం ఒక పెద్ద దర్శకుడు అవకాశం ఇస్తే గొప్పగా భావిస్తానని వ్యాఖ్యానించింది. ఇక హైద‌రాబాద్‌లోనే పుట్టి పెరిగిన అదితికి సినిమాల్లోకి రావ‌డానికి ముందే పెళ్ల‌య్యింది. కొన్నేళ్ల కాపురం త‌ర్వాత భ‌ర్త‌తో స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో విడాకులు తీసుకుంది. ఇక ఇప్పుడు సీనియ‌ర్ హీరో సిద్ధార్థ్‌తో ఆమె స‌హ‌జీవ‌నం చేస్తుంద‌ని.. వారిద్ద‌రు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news