మెగాస్టార్ పక్కన హీరోయిన్గా ఛాన్స్ అంటే అబ్బా.. అంటున్న హీరోయిన్స్..? అవును ఇప్పుడు టాలీవుడ్ లెజండరీ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా ఛాన్స్ ఇస్తామంటే కొందరు హీరోయిన్స్ వెనకాడుతున్నారట. ఈ టాక్ ఈ మధ్యనే ఫిల్మ్ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తోంది. ఒకప్పుడు చిరు సరసన ఛాన్స్ కోసం ఎదురుచూసిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. ఆఖరికి ఆయన సినిమాలో చిన్న వేశం దొరికినా చాలనుకున్నవారున్నారు.
హీరోయిన్స్ మాత్రమే కాదు, మిగతా నటీనటులలోనూ ఇదే ఆరాటం ఉండేది. మ్యూజిక్ డైరెక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్..ఇలా అందరూ అన్నయ్య సినిమాకు ఏదో ఒకరకంగా భాగమవ్వాలని ఆశపడినవారే..ఇంకా పడుతున్నవారే. ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమాలు చేస్తున్న దర్శకులందరూ ఆయన అభిమానులే.. చేయబోతున్నవారూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగినవారే. అలాంటి వారికి దక్కే అదృష్ఠం హీరోయిన్స్‌కీ దక్కుతుంది.
కానీ, కొందరు యంగ్ బ్యూటీస్ చిరు పక్కన సినిమా అంటే ఏజ్ గ్యాప్ కారణంగా నో అంటున్నారట. అంతేకాదు, చిరు సినిమాని వదులుకున్నందుకు బాధపడుతూ కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఇప్పుడు చిరంజీవి పక్కన హీరోయిన్గా చేస్తే మళ్ళీ యంగ్ హీరోల పక్కన అవకాశం రాదేమో అని భయం. ఇంతకముందు కొంతమంది హీరోయిన్ ఇలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారి సరసన నటించి అడ్రస్ లేకుండా పోయారు.
నయనతార, శ్రియ, కాజల్ అగర్వాల్ లాంటి అతికొద్దిమందే ఈ ముసలి హీరోల పక్కన నటించినా కూడా అదృష్ఠం కొద్దీ ఇంకా స్టార్ హీరోయిన్స్‌గా కొనసాగుతున్నారు. శృతి హాసన్ ఇప్పుడు ఒకవైపు చిరు సరసన నటిస్తూనే..మరో వైపు బాలయ్య సరసన నటిస్తోంది. ఆ తర్వాత అమ్మడి కెరీర్ ఎలా ఉంటుందో చెప్పడం కాస్త కష్టమే. ఇంకొందరు హీరోయిన్ మరో విషయంలోనూ భయపడుతున్నారట.
ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ తర్వాత నటించిన సైరా..ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ఫ్లాపులు అందుకున్నారు. ఇక ఇప్పుడు లైన్లో ఉన్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ సినిమాలపై కూడా పెద్ద ఆశల్లేవు. ఇదీ కొందరు యంగ్ హీరోయిన్స్‌ను భయపెడుతున్న విషయమట.